AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dragonfly: తూనీగలు హెచ్చరిస్తున్నాయా.. మేఘం రంగును గమనిస్తున్నాయా.. కోనసీమవాసుల్లో కొత్త గుబులు..

Dragonflies Flying: కోనసీమకు కొత్త ముప్పు పొంచి ఉందా..? ప్రకృతి విరుచుకుపడడానికి సిద్ధమవుతోందా..? జనంలో ఇప్పుడు ఇదే టెన్షన్‌.. ఏ వైపు నుంచి ఏం ముంచుకొస్తుందోనని వణుకుతున్నారు కోనసీమ వాసులు..

Dragonfly: తూనీగలు హెచ్చరిస్తున్నాయా.. మేఘం రంగును గమనిస్తున్నాయా.. కోనసీమవాసుల్లో కొత్త గుబులు..
Dragonflies Flying
Sanjay Kasula
|

Updated on: Sep 28, 2021 | 2:17 PM

Share

రాబోయే వర్షం గురించి తూనీగలు హెచ్చరించగలవా..? మేఘం రంగును గమనించడం ద్వారా మీరు వాతావరణాన్ని అంచనా వేయగలరా? తరాల రైతులు, మత్స్యకారులకు ఇవి ఎలాంటి సమాధానం అందిస్తాయి. వాతావరణాన్ని హైటెక్ శాటిలైట్ ఇమేజింగ్ ఉపయోగించి అంచనా వేసినప్పటికీ.. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు ప్రకృతిలో వచ్చే మార్పును చెబుతుంటారు. నదీ తీర ప్రాంత ప్రజలు వరదలు, తుఫానులు, కరువును సంప్రదాయ మార్గంలో అంచనా వేస్తారు.

ఉదాహరణకు, తీరప్రాంతవాసులు డ్రాగన్‌ఫ్లై (తూనిగ) ఎత్తుకు ఎగురుతుంటే ఈ రోజు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తుంటారు. అదే తక్కువ ఎత్తులో ఎగురుతుందంటే మరికాసేపట్లో వర్షం రానుందని.. తూనిగలు గుంపులుగా కనిపిస్తే ఏదో పెద్ద ప్రమాదం పొంచి ఉందని రైతులు నమ్ముతారు.

ఇదే అంచనా ప్రకారం కోనసీమకు కొత్త ముప్పు పొంచి ఉందా..? ప్రకృతి విరుచుకుపడడానికి సిద్ధమవుతోందా..? జనంలో ఇప్పుడు ఇదే టెన్షన్‌.. ఏ వైపు నుంచి ఏం ముంచుకొస్తుందోనని వణుకుతున్నారు కోనసీమ వాసులు.. దీనికిి కారణం.. లక్షలాదిగా తూనీగలు కమ్ముకు వస్తుండడమే..

కోనసీమలో తూనీగల దండయాత్ర కొనసాగుతోంది. అమలాపురం పరిసర ప్రాంతాల్లో లక్షలాది తూనీగలు సంచరిస్తున్నాయి. ఆకాశంలో ఎటు చూసినా తూనీగలే కనిపిస్తున్నాయి. దీంతో కోనసీమ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడూ వేలల్లో వచ్చే తూనీగలు ఈసారి లక్షల్లో రావడంపై భయపడుతున్నారు. ఏదో ప్రకృతి విపత్తు సంభవించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.

ప్రకృతి విపత్తులు వచ్చే ముందే తూనీగలు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున సంచరిస్తాయనేది కోనసీమ వాసుల అనుమానం. తుఫాన్‌లు, సునామీలు సంభవించే ముందు ఇలా తూనీగలు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. లక్షల్లో తూనీగలు వచ్చాయి కాబట్టి.. ప్రకృతి విపత్తు భీకరంగా ఉండొచ్చని భయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:  Vitamin D Deficiency: మీలో విటమిన్ డి లోపం ఉంటే మీ నాలుక గుర్తిస్తుంది.. ఎలానో తెలుసా..

Gratuity calculation: గ్రాట్యుటీకి సంబంధించిన రూల్స్ మార్చబడ్డాయి.. మీకు ఎంత.. ఎలా పేమెంట్ పొందుతారు.. పూర్తి సమాచారాన్ని ఇక్కడ తీసుకోండి..