Indian Army: జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్న భగ్నం.. పాక్ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్న భారత ఆర్మీ

జమ్ముకశ్మీర్‌లో మరో ఉగ్రకుట్రను ఇండియన్‌ ఆర్మీ భగ్నం చేసింది. ఉరిసెక్టార్‌లో ఏడుగురు ఉగ్రవాదులను హతం చేశారు. ఓ పాక్ టెర్రరిస్ట్‌ను సజీవంగా పట్టుకున్నారు. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Indian Army: జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్న భగ్నం.. పాక్ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్న భారత ఆర్మీ
Indian Army captures 18-year-old Pakistani terrorist in Uri sector
Follow us

|

Updated on: Sep 28, 2021 | 3:12 PM

భారత్‌లో భారీ విధ్వంసానికి పాక్ కుట్రలు పన్నుతోంది. దేశంలో చొరబాట్లకు టెర్రరిస్టులను ఎగదోస్తోంది. కానీ ఎప్పటికప్పుడు పాక్‌ కుట్రలను భారత ఆర్మీ భగ్నం చేస్తోంది. తాజాగా జమ్ముకశ్మీర్‌లో ఓ ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబట్టాడు. ఉరి సెక్టార్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మరో ఉగ్రవాది హతమయ్యాడు. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్నేళ్లలో ఓ పాక్‌ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోవడం ఇదే తొలిసారి. ఐతే అంతకుముందు 2008లో ముంబై ఉగ్రదాడిలో కసబ్‌ను సజీవంగా పట్టుబడ్డాడు. ఆ తర్వాత బాబర్‌ పాత్ర అనే టెర్రరిస్ట్‌ భారత భూభాగంలో చొరబడుతూ ఆర్మీకి చిక్కాడు. 19 ఏళ్ల ఈ టెర్రరిస్ట్‌ తాను లొంగిపోతానని , కాల్చి చంపవద్దని ఆర్మీని వేడుకున్నాడు.

గత కొన్ని వారాలుగా ఉరి, రాంపూర్‌ సెక్టార్ల గుండా భారీ చొరబాట్లకు ముష్కరులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి దేశంలోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించారు. ఐతే నిఘా వర్గాల హెచ్చరికలతో ఆర్మీ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. గతవారం రాంపూర్‌ సెక్టార్‌లో ముగ్గురు పాక్‌ ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. తాజాగా ఉరి సెక్టార్‌లో తమకు తారసపడ్డ టెర్రరిస్టుల పైకి కాల్పులు జరిపింది. ఓ పాక్ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోగా.. మరో ఉగ్రవాదిని హతమార్చింది. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి.

దేశంలో పండుగల వేళ భారీ విధ్వంసానికి కుట్రలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాకిస్తాన్‌ మద్దతున్న ఆఫ్గాన్‌ ఉగ్రవాదులను ఇప్పటికే నియంత్రణ రేఖ వద్ద నక్యాల్‌ సెక్టార్‌లో సిద్ధంగా ఉంచినట్టు గుర్తించారు. వీరందరినీ పూంచ్‌ నదిలో నుంచి భారత్‌లోకి ప్రవేశపెట్టేందుకు శిక్షణ ఇస్తున్నారు. అంతేకాదు. లష్కరే తోయిబా, హర్కత్‌ ఉల్‌ అన్సార్‌, హిజ్బుల్‌ ముజాహుద్దీన్‌ సంస్థల కదలికలు కూడా పెరిగాయి.

Also Read..

Covid-19 Effect: కోవిడ్‌తో మరణించిన తండ్రి.. జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆ తనయుడు ఏం చేశాడంటే..

Dragonfly: తూనీగలు హెచ్చరిస్తున్నాయా.. మేఘం రంగును గమనిస్తున్నాయా.. కోనసీమవాసుల్లో కొత్త గుబులు..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.