Navjot Singh Sidhu Resigns: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పదవికి రాజీనామా

Navjot Singh Sidhu Resignation: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు.

Navjot Singh Sidhu Resigns: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పదవికి రాజీనామా
Navjot Singh Sidhu
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 28, 2021 | 4:04 PM

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉద్దేశించి ఆయన తన రాజీనామా లేఖను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉద్దేశించి ఆయన తన రాజీనామా లేఖను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

పంజాబ్‌ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. పంజాబ్ పీసీసీ చీప్‌ పదవికి నవజ్యోత్‌సింగ్‌ సిద్దూ రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ బీజేపీలో చేరుతారని జోరుగా ఊహాగానాలు విన్పిస్తున్న నేపథ్యంలో సిద్దూ పీసీసీ పదవికి రాజీనామా చేయడం సంచలనం రేపింది. సోనియాగాంధీకి తన రాజీనామా లేఖ పంపించారు సిద్దూ. కాంగ్రెస్‌ లోనే కొననసాగుతానని ఆయన లేఖలో స్పష్టం చేశారు. సోనియా గాంధీకి రాజీనామా లేఖ పంపిన సిద్ధూ.. రాజీనామా లేఖలో పరోక్షంగా అమరీందర్ సింగ్ ప్రస్తావనను తీసుకువచ్చారు. “ఆయనకు వ్యక్తిత్వం లేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు. తన స్వార్థం కోసం లాలూచీ పడుతున్నారు. పంజాబ్ భవిష్యత్తు, సంక్షేమం విషయంలో నేను ఎవరితో రాజీపడను. అందుకే పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను. అయితే, సాధారణ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను” అంటూ రాజీనామా లేఖలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ

పంజాబ్ కాంగ్రెస్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలోని తిరుగుబాటు ఫలితంగా సెప్టెంబర్ 18 న కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. తదనంతరం, సెప్టెంబర్ 20 న, చరణ్‌జిత్ సింగ్ చన్నీ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అయితే, నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన కేబినెట్‌లో తన అభిప్రాయానికి ప్రాధాన్యత లభించనందున కోపంగా ఉన్నట్లు తెలిస్తోంది. కొద్దిరోజులుగా సిద్దూతో తీవ్ర విభేదాల కారణంగా కెప్టన్‌ అమరీందర్‌ను తప్పించింది. అయితే, సిద్దూను సీఎం చేస్తే పంజాబ్‌ సర్వనాశనం అవుతుందని అమరీందర్‌ హెచ్చరించారు. సిద్దూ జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్నారని తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్‌కు సన్నిహితంగా ఉండే సిద్దూను సీఏం చేయవద్దని హైకమాండ్‌ను హెచ్చరించారు.

మరోవైపు, నాటకీయ పరిణామాల మధ్య అమరీందర్‌సింగ్‌ ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా , బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో ఆయన సమావేశమవుతారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, ఢిల్లీకి ఆయన వ్యక్తిగత పనుల మీద వచ్చారని సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలావుంటే, పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఆరునెలల గడువు మాత్రమే ఉంది. అయినప్పటికి అంతర్గత కలహాలు కాంగ్రెస్‌ కొంపముచ్చేలా కన్పిస్తున్నాయి. తాజా సిద్ధూ రాజీనామా పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో వేచిచూడాలి.

సిద్దూ స్థిరత్వం లేని వ్యక్తిః అమరీందర్ సింగ్ పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా చేయడంపై మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. సిద్దూ స్థిరత్వం లేని మనిషి అని ముందే చెప్పాను అన్నారు. దేశ సరిహద్దు రాష్ట్రం అయిన పంజాబ్‌కు సిద్దూ సరియైన వ్యక్తి కాదన్నారు. ఈ మేరకు కెప్టెన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Read Also….  Punjab Politics: ఢిల్లీకి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. బీజేపీతో జట్టు కట్టడానికేనా?