Kanhaiya Kumar: గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణామం.. కాంగ్రెస్ గూటికి కన్హయ్య కుమార్.. రాహుల్ గాంధీ సమక్షంలో చేరిక
సీపీఐ నాయకుడు, జేఎన్‌యు విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో మూడు రంగుల జెండాను కప్పుకున్నారు.
Kanhaiya Kumar join Congress: సీపీఐ నాయకుడు, జేఎన్‌యు విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో ఆపార్టీ జెండాను కప్పుకున్నారు. ఆయనతో పాటు గుజరాత్ దళిత నాయకుడు, స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇద్దరు నేతలు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వచ్చే ఏడాది బీజేపీ పాలిత గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కుమార్ భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) లో చేరారు. బీహార్‌లోని బెగుసరాయ్ స్థానం నుండి బీజేపీకి చెందిన గిరిరాజ్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు కన్హయ్య. ఇక, రాష్ట్రీయ దళిత అధికార మంచ్ (RDAM) కన్వీనర్ కూడా అయిన మేవానీ, 2017 లో కాంగ్రెస్ మద్దతుతో గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలోని వడ్గామ్ అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నారు.
ఇదిలావుంటే, గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ స్పందిస్తూ “మేము యువకులు, కాంగ్రెస్‌లో పనిచేయాలనుకుంటున్నాం. అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు గురించి మాట్లాడే నాయకుడి కింద పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. గతంలో దేశ ప్రజల కోసం స్వరం పెంచాము. బడుగు, బలహీన వర్గాలను బలోపేతం చేయాలని, వారి గొంతుగా ఉండాలని కోరుకుంటున్నాను” అని వ్యాఖ్యానించారు.
CPI leader Kanhaiya Kumar and Gujarat MLA Jignesh Mewani joins Congress in the presence of Rahul Gandhi in New Delhi pic.twitter.com/7t0tf8lqmp
— ANI (@ANI) September 28, 2021
BSP MLA Ram Bhai: లంచం తీసుకుంటే తప్పేముంది.. బీఎస్పీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. వీడియో వైరల్