BJP Phasewise War: దశలవారీగా కాంగ్రెస్‌పై బీజేపీ యుద్ధం.. ఒక్కో విడతలో ఒక్కో అస్త్రం ప్రయోగం

దేశంలో 7 దశల వారీగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. మూడోసారి అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ దశలవారీగా కాంగ్రెస్‌పై ఎన్నికల యుద్ధం చేస్తోంది. ఒక్కో ఫేజులో ఒక్కో అస్త్రంతో కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

BJP Phasewise War: దశలవారీగా కాంగ్రెస్‌పై బీజేపీ యుద్ధం.. ఒక్కో విడతలో ఒక్కో అస్త్రం ప్రయోగం
Narendra Modi Rahul Gandhi
Follow us

|

Updated on: Apr 27, 2024 | 8:29 AM

దేశంలో 7 దశల వారీగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. మూడోసారి అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ దశలవారీగా కాంగ్రెస్‌పై ఎన్నికల యుద్ధం చేస్తోంది. ఒక్కో ఫేజులో ఒక్కో అస్త్రంతో కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తొలి, మలి విడత ప్రచారంలో బీజేపీ ప్రయోగించిన అస్త్రాలేంటి? ఇక మూడో ఫేజులో మాత్రం..వీడియో పే రచ్చతో కాంగ్రెస్‌ ఫ్యూజులు ఎగరగొట్టేస్తామంటోంది.

తొలి విడత ప్రచారంలో కాంగ్రెస్‌పై రామ బాణం ప్రయోగించింది భారతీయ జనతా పార్టీ. 500 ఏళ్ల హిందువుల కలను తామే నెరవేర్చామంది బీజేపీ. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కల సాకారం చేశామంటూ కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది కాషాయ పార్టీ. ఇక రెండో దశ ప్రచారంలో, సంపద పన్ను పేరుతో ప్రజల సొమ్మును కాంగ్రెస్‌ లాక్కుంటుంది అనే ఆరోపణలతో ప్రచార భేరి మోగించింది బీజేపీ. అమెరికాలో లాగానే భారత్‌లో కూడా వారసత్వ పన్ను వేస్తే బాగుంటుందని, కాంగ్రెస్‌ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ అధ్యక్షుడు శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఆయుధంగా మారాయి. వారసత్వ పన్ను పేరుతో దేశ ప్రజల సంపదను కాంగ్రెస్‌ లాక్కునే ప్రయత్నం చేస్తోందంటూ రెండో విడత ప్రచారంలో మోదీ ఆరోపించారు. ముస్లిం లీగ్‌ నుంచి ప్రేరణ పొందే కాంగ్రెస్‌ మేనిఫెస్టోను రూపొందించారని మోదీ విమర్శించారు.

ఇక మూడో విడత ప్రచారంలో…మన్మోహన్‌ వీడియో పే రచ్చ అండ్‌ చర్చకు తెర లేపింది బీజేపీ. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఇదే హాట్‌ టాపిక్‌. దేశ వనరులపై తొలి హక్కు ముస్లింలదే అన్న మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో వెలుగులోకి వచ్చింది. అది బీజేపీకి ఆయుధంగా మారితే…కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో పడేస్తోంది. దేశ వనరులపై మొదటి హక్కు ముస్లింలదేనంటూ మన్మోహన్ సింగ్‌ గతంలో అన్నారని మోదీ స్పష్టం చేశారు. ఈ వీడియో చూశాక కాంగ్రెస్‌కు మాట పడిపోయిందంటూ ఎద్దేవా చేశారు.

2009 ఎన్నికల ప్రచారంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వనరులపై తొలి హక్కు ముస్లింలకే ఉంటుందన్నారు ఆయన. దీంతో బీజేపీ ఎదురుదాడి దిగడంతో మన్మోహన్‌ అలా అనలేదు, అవన్నీ రూమర్లే అని ఇప్పటిదాకా చెప్పుకొచ్చింది కాంగ్రెస్‌. అయితే తాజాగా ఈ కామెంట్స్‌పై డిఫెన్స్‌లో పడిందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇలా మూడో దశలో కాంగ్రెస్‌పై మరో తాజా అస్త్రంతో విరుచుకుపడుతోంది బీజేపీ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…