చల్లారని రగడ…మిజోరం ఎంపీ హెచ్చరిక..ఢిల్లీకి అస్సాం పోలీసుల ‘పంచాయితీ’ !
అస్సాం-మిజోరం మధ్య విభేదాలు ఇంకా రాజుకుంటూనే ఉన్నాయి. మిజోరంకు చెందిన ఎంపీ ఒకరు చేసిన తీవ్రమైన హెచ్చరికపై అస్సాం పోలీసులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆయన వార్నింగ్ పై తమ స్పందనను తెలియజేసేందుకు
అస్సాం-మిజోరం మధ్య విభేదాలు ఇంకా రాజుకుంటూనే ఉన్నాయి. మిజోరంకు చెందిన ఎంపీ ఒకరు చేసిన తీవ్రమైన హెచ్చరికపై అస్సాం పోలీసులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆయన వార్నింగ్ పై తమ స్పందనను తెలియజేసేందుకు, నేరుగా ఢిల్లీలో హోమ్ శాఖ అధికారుల దృష్టికి దీన్ని తెచ్చేందుకు ఈ రాష్ట్ర పోలీసులు గురువారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఇటీవల ఉభయ రాష్ట్రాల సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో ఏడుగురు అస్సాం పోలీసులు మరణించగా.. రెండు రాష్ట్రాలకు చెందిన 80 మందికి పైగా గాయపడ్డారు., అయితే తమ పోలీసు శాఖపై, తమ సిబ్బందిపైన జరిగిన కుట్రలో మిజోరంకు చెందిన రాజ్యసభ ఎంపీ కె.వన్లవేన కుట్ర ఉందని అస్సాం పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇందుకు ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమంటున్నారు. అస్సాం పోలీసులపై తాము పగ తీర్చుకుంటామని ఆయన హెచ్చరిక చేశారు. నిన్న ఆయన పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడుతూ…200 మందికి పైగా అస్సాం పోలీసులు తమ రాష్ట్ర భూభాగం లోకి ప్రవేశించారని, అకారణంగా తమ పోలీసులపై కాల్పులు జరిపారని ఆరోపించారు. మా వాళ్ళు ఎలాంటి ఫైరింగ్ జరపకపోయినా వాళ్ళు రెచ్చగొట్టారు. సంయమనంతో వ్యవహరించాలని మా పోలీసులు చెప్పినా వారు వినలేదు.. ఇందుకు అస్సాం పోలీసులను చంపకుండా వదిలిపెట్టం అని ఆయన ఆవేశంగా వ్యాఖ్యానించారు. వారు వస్తే చంపేస్తాం అని హెచ్చరించారు.
ఇదంతా చూస్తే ఇటీవల జరిగిన హింస, అల్లర్లలో ఈయన హస్తం ఉందని, ఈయనే కుట్రకు పాల్పడ్డాడని అస్సాం పోలీసులు ఆరోపిస్తున్నారు. నిజానికి తమపై మిజోరాం పోలీసులు, స్థానికులు జరిపిన దాడులకు సంబంధించిన వీడియోలు తమవద్ద ఉన్నాయన్నారు. ఈ దాడికి దిగినవారి సమాచారమిస్తే రూ. 5 లక్షల రివార్డు ఇస్తామని కూడా వారు ప్రకటించారు. ఈ ఉద్రిక్తత నేపథ్యంలో అస్సాం బరాక్ వ్యాలీ ప్రజలు నిన్న మిజొరాంని , దేశంలోని ఇతర ప్రాంతాలను కలిపే జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు..
మరిన్ని ఇక్కడ చూడండి : ట్రైలర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ..ట్రైలర్ ఏమోగానీ ఆర్జీవీ రియాక్షన్ మాత్రం హైలెట్..:RGV reaction Video.