Sachin Tendulkar: మరోసారి మంచిమనసు చాటుకున్న సచిన్.. పేద రైతు కూతురు డాక్టర్ చదవడానికి అండగా..

 Sachin Tendulkar: ఎవరైనా కష్టంలో ఉన్నారు అని తెలిస్తే.. ఆదుకోవడానికి సినీనటులే కాదు, క్రికెటర్స్ కూడా ముందుంటారు.. తాజాగా భారత క్రికెట్ మాజీ ప్లేయర్ , క్రికెట్ దిగ్గజం..

Sachin Tendulkar: మరోసారి మంచిమనసు చాటుకున్న సచిన్.. పేద రైతు కూతురు డాక్టర్ చదవడానికి అండగా..
Sachin
Follow us

|

Updated on: Jul 29, 2021 | 8:47 AM

Sachin Tendulkar: ఎవరైనా కష్టంలో ఉన్నారు అని తెలిస్తే.. ఆదుకోవడానికి సినీనటులే కాదు, క్రికెటర్స్ కూడా ముందుంటారు.. తాజాగా భారత క్రికెట్ మాజీ ప్లేయర్ , క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోసారి తన మంచి మనసుని చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారికి తనతోచిన సాయం చేసి.. అండగా నిలబడతారు. ఇక సచిన్ టెండూల్కర్ ఇప్పటికే పలు స్వచ్చంద సంస్థలతో కలిసి పనిచేస్తూ.. ఆపన్నులకు అండగా నిలబడుతున్నారు. కరోనా వైరస్ సమయంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. చాలామంది బాధితులకు అండగా నిలబడ్డారు. తాజాగా సచిన్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. పేద రైతు కుమార్తె కలను నిజం చేయడానికి అండగా నిలబడి రియల్ హీరోగా నిలిచారు. పేద రైతు కుమార్తె డాక్టర్‌ అయ్యేంతవరకు అయ్యే ఖర్చులను భరించనున్నారు. వివరాల్లోకి వెళ్తే..

మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా జైరే ప్రాంతానికి చెందిన దీప్తి విశ్వాస్ రావు నిరుపేద రైతు.. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఆయన కుమార్తె దీప్తి కి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరిక.. అదే కలలు కంటూ చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుంది. మెరిట్ మార్కులతో పాస్ అవుతూ వచ్చింది. మంచి మార్కులను సొంతం చేసుకున్న దీప్తికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. అయితే దీప్తి ఫ్యామిలీ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే. దీంతో దీప్తి డాక్టర్ చదువు కోసం అయ్యే ఖర్చుని వారు భరించలేనంత భారంగా మారింది. దీప్తి గురించి సేవా సహ్యోగ్‌ అనే స్వచ్చంద సంస్థకు తెలిసింది. వెంటనే ఆ సంస్థ ఈ విషయాని దీప్తి సంకల్పం గురించి సచిన్‌ టెండూల్కర్ ఫౌండేషన్‌ ‘ఎస్‌ఆర్‌టీ10’ దృష్టికి తీసుకెళ్ళింది. వెంటనే ఆ సంస్థ స్పందించి దీప్తి భవిష్యత్ కు భరోసానిస్తూ.. డాక్టర్ చదువు అయ్యేవరకూ అయ్యే ఖర్చులను తాము భరిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Also Read: మరోసారి దేశభక్తిని, దానగుణాన్ని చాటుకున్న అక్షయ్ కుమార్.. బిఎస్ఎఫ్ స్కూల్ రిపేర్‌కు భారీ విరాళం