Akshay Kumar: మరోసారి దేశభక్తిని, దానగుణాన్ని చాటుకున్న అక్షయ్ కుమార్.. బిఎస్ఎఫ్ స్కూల్ రిపేర్‌కు భారీ విరాళం

Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా హీరోనే.. ప్రకృతి వైపరీత్యాల సమయంలోనేకాదు, రైతులకు అండగా ఉంటాడు....

Akshay Kumar: మరోసారి దేశభక్తిని, దానగుణాన్ని చాటుకున్న అక్షయ్ కుమార్.. బిఎస్ఎఫ్ స్కూల్ రిపేర్‌కు భారీ విరాళం
Akshay Kumar
Follow us
Surya Kala

|

Updated on: Jul 29, 2021 | 8:14 AM

Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా హీరోనే.. ప్రకృతి వైపరీత్యాల సమయంలోనేకాదు, రైతులకు అండగా ఉంటాడు.. దేశ అక్షయ్ కుమార్ దేశ భక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే.. తాజాగా ఈ రియల్ హీరో మరోసారి తన దేశ భక్తిని .. దానగుణాన్ని చాటుకున్నాడు. కరోనా దేశంలో అడుగు పెట్టి.. లాక్ డౌన్ విధించిన సమయంలో భారీ విరాళాన్ని ఇచ్చిన అక్షయ్ ఈసారి బిఎస్ఎఫ్ జవాన్ల కోసం స్పందించాడు. కాశ్మీర్ లో బీఎస్ఎఫ్ నడిపే ఓ స్కూల్ కోసం అక్షయ్ కుమార్ భారీ ఆర్దిక సాయం ప్రకటించాడు. ఇటీవల అక్షయ్ కాశ్మీర్ కు వెళ్లిన సమయంలో ఓ పాఠశాల పాడుబడినల్టు కనిపించింది. దీంతో ఆ స్కూల్ రిపేర్ చేయడం కోసం ఏకంగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. వివరాల్లోకి వెళ్తే.. .

గత నెల జూన్ లో కాశ్మీర్ కి వెళ్లిన అక్షయ్ కుమార్ బీఎస్ఎఫ్ జవాన్లతో కొంత సేపు గడిపాడు. అంతేకాదు రియల్ హీరోస్ ని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు కూడా.. అయితే అప్పుడు కాశ్మీర్ లోనే ఓ పాడుబడిన స్కూల్ బిల్డింగ్ ను చూశాడు. వెంటనే తాను స్కూల్ పునర్ నిర్మాణం కోసం కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించాడు.

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

తాజాగా బీఎస్ఎఫ్ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఆ పాఠశాల నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకం ఫోటోని షేర్ చేసింది. ఆ శిలా ఫలకంపై పద్మశ్రీ బిరుదుతో కూడిన అక్షయ్ కుమార్ పేరు ను మనం చూడవచ్చు. ఈ కొత్త పాఠశాల పేరు ‘హరీ ఓం భాటియా ఎడ్యుకేషన్ బ్లాక్ . అంటే పాఠశాలకు అక్షయ్ కుమార్ తండ్రి పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘బచ్చన్ పాండే’ షూటింగ్ జరుపుకుంటుంది.

Also Read:

సీతాకోకచిలక’ హీరో కార్తీక్‌కు తీవ్ర గాయాలు.. వ్యాయామం చేస్తున్న సమయంలో