Women-led nursery: అతిపెద్ద సింగిల్‌సైట్ నర్సరీ.. మహిళలే అన్నీ తామై నడిపిస్తున్నారు
కడలూరులో ఆసియాలోనే అతిపెద్ద మహిళల నర్సరీ పచ్చదనంతో కళకళలాడుతోంది. సద్గురు ప్రారంభించిన కావేరీ కాలింగ్ ప్రాజెక్ట్‌లో భాగంగా, ఈ నర్సరీ లక్షల్లో మొక్కలను ఉత్పత్తి చేస్తోంది. అడ్మినిస్ట్రేషన్ నుంచి పెంపకం వరకు, మహిళలే అన్ని పనులను నిర్వర్తిస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

తమిళనాడులోని కడలూరులో ఒక నర్సరీ ఉంది. కానీ ఇది సాధారణ నర్సరీ కాదు. ఇది ఆసియాలోనే అతిపెద్ద సింగిల్‌సైట్ నర్సరీ. అంతేకాదు మహిళలే పూర్తిగా నిర్వహిస్తున్న నర్సరీ. ఇది సద్గురు ప్రారంభించిన ‘కావేరీ కాలింగ్’ ప్రాజెక్ట్‌లో భాగంగా పనిచేస్తోంది. గత సంవత్సరం తమిళనాడులో కావేరీ కాలింగ్ కార్యక్రమం కింద 1.2 కోట్లు చెట్లు నాటగా, వాటిలో 85 లక్షల మొక్కలు ఈ ఒక్క నర్సరీ నుంచే సరఫరా అయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 12 కోట్ల మొక్కలు నాటగా.. అందులో ఈ నర్సరీ కృషి కీలకం. ప్రస్తుతం నర్సరీ పచ్చదనంతో కళకళలాడుతోంది. లక్షలాది మొక్కలు రైతులకు చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం నుంచే వాటి రవాణా ప్రారంభం కానుంది.
ఈ నర్సరీ ప్రత్యేకత ఏమిటంటే.. పూర్తిగా మహిళల చేత నిర్వహించడం. అడ్మినిస్ట్రేషన్ నుంచి ఫైనాన్స్ వరకు, విత్తనాల నాటకం నుంచి మొక్కల పెంపకం వరకు ప్రతి దశను మహిళలే స్వయంగా నిర్వహిస్తున్నారు. సహజసిద్ధమైన గ్రీన్ రివల్యూషన్‌కు ఈ మహిళలే నడిచే చిహ్నాలు. పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, గ్రామీణ అభివృద్ధి.. ఈ మూడు విలువలను ఒకే చోట చూపిస్తున్న ప్రేరణాత్మక కథ ఇది. కడలూరులోని ఈ నర్సరీ కేవలం మొక్కలతో కాదు.. ఆశతో, ఆత్మవిశ్వాసంతో, ఆకాంక్షలతో కూడా పుష్పిస్తోంది.

Asia’s Largest Nursery
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




