AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BS Yediyurappa: కర్ణాటక బీజేపీలో యడుయూరప్ప కథ ముగిసినట్లేనా.. అధిష్ఠానం అతని ప్రాధాన్యత తగ్గించిందా..?

ఒకప్పుడు కర్ణాటక బీజేపీ(BJP)లో చక్రం తిప్పిన ఆ రాష్ట్ర మాజీ సీఎం యడుయూరప్ప(BS Yediyurappa) క్రమంగా తన ప్రభావాన్ని కోల్పోతున్నాడు. తాజాగా ఆయన కొడుకును ఎమ్మెల్సీగా చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి...

BS Yediyurappa: కర్ణాటక బీజేపీలో యడుయూరప్ప కథ ముగిసినట్లేనా.. అధిష్ఠానం అతని ప్రాధాన్యత తగ్గించిందా..?
Bs Yediyurappa
Srinivas Chekkilla
|

Updated on: May 30, 2022 | 11:42 AM

Share

ఒకప్పుడు కర్ణాటక బీజేపీ(BJP)లో చక్రం తిప్పిన ఆ రాష్ట్ర మాజీ సీఎం యడుయూరప్ప(BS Yediyurappa) క్రమంగా తన ప్రభావాన్ని కోల్పోతున్నాడు. తాజాగా ఆయన కొడుకును ఎమ్మెల్సీగా చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పార్టీ అధిష్ఠానం టికెట్‌ను నిరాకరించింది. దీంతో అతని శకం ముగిసిందని భావిస్తున్నారు. నిజానికి యడుయూరప్ప డౌన్‌ఫాల్‌ 2018లో ప్రారంభమైంది. ఆయన అసెంబ్లీ అభ్యర్థులను ఎంపిక చేయడంలో తప్పిదాలుచేశాడు. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. రెండు సంవత్సరాల తర్వాత అతన్ని నియంత్రించాలని బీజేపీ అధిష్ఠానం భావించింది. యాడుయురప్పను నియంత్రించడానికి మరో గట్టి నాయకుడిని తయారు చేయాలని బొమ్మరబెట్టు లక్ష్మణరాధ సంతోషన్‌(BL Santhosh)ను ప్రోత్సహించింది. 55 ఏళ్ల బీఎల్‌ సంతోష్‌ కుమార్ కర్ణాటక ఉడిపి జిల్లాలోని హైల్స్‌కు చెందినవాడు.

తాజాగా కర్ణాటక శాసన మండలిలో నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, యడుయూరప్పతో కూడిని రాష్ట్రస్థాయి కమిటీ యడుయూరప్ప కొడుకు విజయేంద్రను ఒక అభ్యర్థిగా ప్రకటించారు. కానీ నామినేషన్‌ వేయడానికి ఐ ప్రకటించిన జాబితాలో దు గంటలకు ముందు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో విజయేంద్రకు లేదా రాష్ట్ర శాఖ సిఫార్సు చేసినవారు లేరు. బీజేపీ అధిష్ఠానంలింగాయత్‌ కోటా నుంచి మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ సవడిని ఎంపిక చేశారు. మిగతా ముగ్గురిలో నాయరణస్వామి(ఎస్సీ), కేశవ ప్రసాద్‌(ఓబీసీ), హేమలత నాయక్‌(ఎస్టీ-మహిళ) ఉన్నారు.

నామినేషన్‌ వేసే కొద్ది గంటల ముందు టికెట్‌ దక్కకపోవడంపై విజయేంద్ర స్పందించాడు. ఎవరు తొందరపడొద్దని తన మద్దతు దారులను కోరారు. విజయేంద్ర మద్దతుదారులు పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై మీడియా సమావేశం నిర్వహించిన యడుయూరప్ప తన కుమారుడికి భవిష్యత్‌లో పెద్ద వదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2018లో వరుణ నియోజకవర్గం నుంచి విజయేంద్రకు ఎమ్మెల్యే టికెట్‌ కూడా నిరాకరించారు.

ఇవి కూడా చదవండి
Follow Us