AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Michael Vaughan: ఎంత గొప్ప ఆటగాడైనా ఎప్పుడూ ఒకేలా ఆడలేడు.. ప్రస్తుతానికి అతను విశ్రాంతి తీసుకుంటే మంచిది..

ఎంత గొప్ప ఆటగాడైనా కెరీర్‌ మొత్తం ఒకేలా ఆడలేడని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌(Michael Vaughan) అన్నారు. ఇది విరాట్‌ కోహ్లీ(Virat kohli) విషయంలో జరుగుతోందని అందుకే అతను విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు...

Michael Vaughan: ఎంత గొప్ప ఆటగాడైనా ఎప్పుడూ ఒకేలా ఆడలేడు.. ప్రస్తుతానికి అతను విశ్రాంతి తీసుకుంటే మంచిది..
Vaughan
Srinivas Chekkilla
|

Updated on: May 30, 2022 | 8:56 AM

Share

ఎంత గొప్ప ఆటగాడైనా కెరీర్‌ మొత్తం ఒకేలా ఆడలేడని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌(Michael Vaughan) అన్నారు. ఇది విరాట్‌ కోహ్లీ(Virat kohli) విషయంలో జరుగుతోందని అందుకే అతను విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. కుటుంబంతో హాయిగా గడపాలన్నాడు. రెండున్నర సంవత్సరాలుగా విరాట్‌ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు జరుగుతోన్న భారత టీ20 లీగ్‌(IPL 2022) 15వ సీజన్‌లోనూ కోహ్లీ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలోనే వాన్‌ మాట్లాడాడు. ‘కోహ్లీ గొప్ప ఆటగాడే కానీ.. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. రెండు, మూడేళ్ల క్రితం కోహ్లీ బరిలోకి దిగుతున్నాడంటే శతకం చేస్తాడనే అంచనాలు ఉండేవి. అంత గొప్ప స్థాయిలో ఆడేవాడు. అయితే ఎవరైనా కెరీర్‌ మొత్తం ఒకేలా తేలిగ్గా పరుగులు సాధిస్తూ ఆడలేరు స్పష్టం చేశాడు. కోహ్లీ కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాడు. అతడికి ఇప్పుడు కాస్త విరామం కావాలి. కొన్నిరోజులు కుటుంబంతో హాయిగా గడపాలి. తర్వాత ఇంగ్లాండ్‌కు వెళ్లి రాణించాలి. ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నా కష్టపడితే మళ్లీ ఫామ్‌ అందుకుంటాడు. తిరిగి సెంచరీల మీద సెంచరీలు సాధిస్తాడు’ అని వాన్‌ చెప్పాడు.

అటు ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌లీ సైతం కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. అతడు పరుగులు చేయకపోతే తాను కూడా బాధపడతానని అన్నాడు. కోహ్లీ పరుగులు చేసినప్పుడు ఆ జట్టు కూడా బాగా ఆడుతుంది. అతడు ఆడకపోతే అది కూడా విఫలమవుతుంది. 2016లో అతడు అత్యధిక పరుగులు చేసినప్పుడు బెంగళూరు అత్యద్భుత ప్రదర్శన చేసిందని గుర్తు చేశాడు. రెండున్నరేళ్లకు పైగా అంతర్జాతీయ సెంచరీ చేయని కోహ్లr, ఐపీఎల్‌ 2022లో 16 మ్యాచ్‌లు ఆడి 22.73 కంటే తక్కువ సగటుతో 341 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ ఈ సీజన్‌లో చాలా మ్యాచ్‌ల్లో ఓపెనింగ్‌గా వచ్చాడు.

ఇవి కూడా చదవండి