AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Khan: 20 రోజులకు పైగా కస్టడీలో ఉన్న ఆర్యన్‌ ఖాన్.. అతనికి పరిహారం చెల్లించాల్సిందేనా..

గత ఏడాది డ్రగ్స్(Drugs) కేసులో 20 రోజులకు పైగా పోలీస్ కస్టడీలో ఉన్న షారుఖ్ ఖాన్(Sharuk Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్(Aryan Khan) అన్ని ఆరోపణల నుంచి క్లియర్ బయటపడ్డాడు.

Aryan Khan: 20 రోజులకు పైగా కస్టడీలో ఉన్న ఆర్యన్‌ ఖాన్.. అతనికి పరిహారం చెల్లించాల్సిందేనా..
Aryan Khan
Srinivas Chekkilla
|

Updated on: May 28, 2022 | 12:45 PM

Share

గత ఏడాది డ్రగ్స్(Drugs) కేసులో 20 రోజులకు పైగా పోలీస్ కస్టడీలో ఉన్న షారుఖ్ ఖాన్(Sharuk Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్(Aryan Khan) అన్ని ఆరోపణల నుంచి క్లియర్ బయటపడ్డాడు. 2021 అక్టోబర్‌లో మాదకద్రవ్యాల వినియోగం ఆరోపణపై ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అతన్ని అరెస్టు చేసింది. ఇప్పుడు అతడికి వ్యతిరేకంగా తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఎన్‌సీబీ తేల్చింది. కోర్టులో చార్జిషీటు దాఖలు చేసినప్పుడు ఆర్యన్‌ఖాన్‌ పేరు పొందుపర్చలేదు. ఆర్యన్ ఖాన్‌కి ఇప్పుడు క్లీన్ చిట్ లభించడంతో, అతను జైలులో గడిపిన కాలానికి పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందా లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది.

భారతీయ రాజ్యాంగం ప్రకారం తప్పుడు జైలు శిక్ష అనేది ఆర్టికల్ 21, ఆర్టికల్ 22 కింద ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. దీనికి పరిహారం ఇవ్వడంతో సరిపుచ్చవచ్చ అన్నది ప్రశ్న. UK, జర్మనీ, US, కెనడా, న్యూజిలాండ్‌తో సహా అనేక దేశాలు తప్పుడు అరెస్టు విషయంలో పరిహారం పొందేందుకు చట్టబద్ధమైన హక్కును రూపొందించాయి. యూకేలో క్రిమినల్ జస్టిస్ యాక్ట్ 1988 చట్టబద్ధమైన ఫ్రేమ్‌వర్క్‌ను నిర్దేశిస్తుంది. దీని ప్రకారం తప్పుడు నేరారోపణ ఫలితంగా శిక్షను అనుభవించిన వ్యక్తికి పరిహారం చెల్లించాలి. ఇది పరిహారం మొత్తాన్ని అంచనా వేసేటప్పుడు పరిగణించవలసిన అంశాలను కూడా పొందుపరిచింది.

Follow Us