Kerala: కేరళలో మళ్ళీ వెలుగులోకి మెదడు తినే అమీబా.. మూడేళ్ళ చిన్నారికి నిర్ధారణ.. ఇది అంటువ్యాధా.. తెలుసుకోండి.

వ్యాధి సోకిన తర్వాత తొమ్మిది రోజులలోపు లక్షణాలు కనిపిస్తాయి. ప్రాథమిక లక్షణాలు తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, మెడను తిప్పడంలో ఇబ్బంది. తరువాత, పరిస్థితి తీవ్రంగా మారిన్నప్పుడు మూర్ఛ, స్పృహ కోల్పోవడం , జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. వెన్నుపాము నుండి ద్రవాన్ని తీసుకుని పరీక్ష చేయడం ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఇదిలా ఉంటే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని వైద్యులు చెబుతున్నారు.

Kerala: కేరళలో మళ్ళీ వెలుగులోకి మెదడు తినే అమీబా.. మూడేళ్ళ చిన్నారికి నిర్ధారణ.. ఇది అంటువ్యాధా.. తెలుసుకోండి.
Amoebic Meningoencephalitis
Follow us

|

Updated on: Jul 26, 2024 | 2:03 PM

కేరళలో మళ్లీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ వ్యాధి కేసు వెలుగులోకి వచ్చింది. కన్నూరులోని తాలిపరానికి చెందిన మూడున్నరేళ్ల బాలుడికి అమీబిక్ మెదడువాపు వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం చిన్నారి కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. పుదుచ్చేరిలోని ల్యాబ్‌లో నిర్వహించిన పీసీఆర్‌ పరీక్షలో వ్యాధి నిర్ధారణ అయింది. పరియారం వైద్య కళాశాలలో నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో చిన్నారి అమీబిక్ మెదడువాపు వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. అయితే చిన్నారి మందులకు రెస్పాండ్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు.

అమీబిక్ ఎన్సెఫాలిటిస్ అంటే ఏమిటి?

అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్, అమీబిక్ ఎన్సెఫాలిటిస్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధిని కలిగించే అమీబా నీటిలో నివసిస్తుంది. నీటిలో నివసించే అమీబా ముక్కులోని సన్నని పొర ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించి మెదడును తీవ్రంగా ప్రభావితం చేసి వ్యాధికి కారణమవుతుంది.

అమీబా మెదడులోకి ప్రవేశించినప్పుడు..మెదడు మెదడు కణాలను తీవ్రంగా ప్రభావితం చేతుంది. ఎడెమా అభివృద్ధి చెందుతుంది. తీవ్రంగా మారుతుంది. చివరికి మరణానికి దారితీస్తుంది. జపనీస్ జ్వరం, నిపా వంటి వ్యాధులలోలా.. ఇది మెదడువాపుగా మారుతుంది. అయితే అమీబిక్ ఎన్సెఫాలిటిస్ అరుదైన వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఒక వారం తర్వాత మాత్రమే లక్షణలు కనిపిస్తాయని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

వ్యాధి లక్షణాలు

వ్యాధి సోకిన తర్వాత తొమ్మిది రోజులలోపు లక్షణాలు కనిపిస్తాయి. ప్రాథమిక లక్షణాలు తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, మెడను తిప్పడంలో ఇబ్బంది. తరువాత, పరిస్థితి తీవ్రంగా మారిన్నప్పుడు మూర్ఛ, స్పృహ కోల్పోవడం , జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. వెన్నుపాము నుండి ద్రవాన్ని తీసుకుని పరీక్ష చేయడం ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఇదిలా ఉంటే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని వైద్యులు చెబుతున్నారు.

ఎలా రక్షించుకోవాలి?

  1. స్విమ్మింగ్ పూల్స్ లేదా చెరువులకు వెళ్లేటప్పుడు సురక్షితంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
  2. వీలైనంత వరకు సరస్సులు, నదులు, నీటి బుగ్గలలో ఈత కొట్టడం మానుకోండి.
  3. కొలనులు, బావులను క్లోరినేట్ చేయాలి. ఈ బ్యాక్టీరియా ముక్కు ద్వారా ప్రవేశిస్తుంది కనుక ఈత కొట్టేటప్పుడు ముక్కు క్లిప్ ధరించడానికి ప్రయత్నించండి.
  4. నీటిలో ఎక్కువసేపు మునిగి ఉండవద్దు.
  5. ఈత కొట్టిన తర్వాత శుభ్రంగా స్నానం చేయడం మర్చిపోవద్దు.
  6. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల సలహా అనుసరించి చికిత్స తీసుకోండి. స్వీయ వైద్యం చేయవద్దు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది కేవలం పాటకుల జాగ్రత్త కోసం ఇచ్చిన సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా సరే వైద్య నిపుణులను సంప్రదించి సలహా అనుసరించండి.

కేరళలో మళ్ళీ వెలుగులోకి మెదడు తినే అమీబా.. చిన్నారికి నిర్ధారణ..
కేరళలో మళ్ళీ వెలుగులోకి మెదడు తినే అమీబా.. చిన్నారికి నిర్ధారణ..
గేదేపై హీరోయిన్‏ను కూర్చొబెట్టి షూట్ చేసిన డైరెక్టర్..
గేదేపై హీరోయిన్‏ను కూర్చొబెట్టి షూట్ చేసిన డైరెక్టర్..
నాన్నకు ప్రేమతో.. ఆ కొడుకులు ఏం చేశారంటే.. ఊహించని కానుక !!
నాన్నకు ప్రేమతో.. ఆ కొడుకులు ఏం చేశారంటే.. ఊహించని కానుక !!
అనంత అంబానీ వద్ద ఖరీదైన కార్లు.. వాటి ధర ఎంతో తెలుసా?
అనంత అంబానీ వద్ద ఖరీదైన కార్లు.. వాటి ధర ఎంతో తెలుసా?
మీ పేరు 'A' అక్షరంతో మొదలువుతోందా.? ఈ నిజాలను నమ్మి తీరాల్సిందే
మీ పేరు 'A' అక్షరంతో మొదలువుతోందా.? ఈ నిజాలను నమ్మి తీరాల్సిందే
ఈ ఒక్క క్యాప్సూల్‌తో మచ్చలు, మొటిమలు తగ్గి మీ ముఖం మెరుస్తుందట..!
ఈ ఒక్క క్యాప్సూల్‌తో మచ్చలు, మొటిమలు తగ్గి మీ ముఖం మెరుస్తుందట..!
ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడిన హీరోయిన్..
ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడిన హీరోయిన్..
ఏపీ ఆర్థిక స్థితిపై మాజీ సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ఏపీ ఆర్థిక స్థితిపై మాజీ సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడానికి ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవ
ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడానికి ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవ
కావ్య, ధాన్యలక్ష్మిల ఛాలెంజ్.. కళ్యాణ్, అప్పూల పెళ్లి జరుగుతుందా
కావ్య, ధాన్యలక్ష్మిల ఛాలెంజ్.. కళ్యాణ్, అప్పూల పెళ్లి జరుగుతుందా