బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే సమాధానం ఇస్తాం! వారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాస్ వార్నింగ్..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదులకు తీవ్ర హెచ్చరిక చేశారు. మళ్లీ దాడికి పాల్పడితే "గోలీ కా జవాబ్ గోలీ సే" (బుల్లెట్‌లకు బుల్లెట్లతోనే సమాధానం) ఉంటుందని స్పష్టం చేశారు. బీహార్‌లో తయారైన పేలుడు పదార్థాలను ఈ ఉగ్రవాదులపై ఉపయోగిస్తామని తెలిపారు.

పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదులు భారత్‌పై కన్నెత్తి చూడొద్దని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం హెచ్చరించారు. వారు మళ్లీ దాడి గురించి ఆలోచించినా “గోలీ కా జవాబ్ గోలీ సే దియా జాయేగా” (బుల్లెట్‌లకు బుల్లెట్లతోనే సమాధానం ఇస్తాం) అని స్పష్టం చేశారు. బీహార్ ప్రతిపాదిత రక్షణ కారిడార్‌లో తయారు చేసిన పేలుడు పదార్థాలను ఈ ఉగ్రవాదులపై ఉపయోగించనున్నట్లు ఆయన తెలిపారు.
పాకిస్తాన్ నుండి వచ్చిన ఉగ్రవాదులు పహల్గామ్‌లో మన పౌరులపై దాడి చేశారు. వారు మన తల్లులు, సోదరీమణుల నుదిటి నుండి సిందూర్‌ను తుడిచిపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 20 రోజుల్లో ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించడం ద్వారా దానికి ప్రతీకారం తీర్చుకున్నారు. భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాదులను తటస్థీకరించింది అని బీహార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో షా అన్నారు.
ప్రధాని మోదీ బీహార్‌లో డిఫెన్స్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదులు తమ తప్పును పునరావృతం చేస్తే బుల్లెట్‌లకు బుల్లెట్లతోనే సమాధానం ఇస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులపై ఉపయోగించబోయే ఫిరంగులు ‘బీహార్‌లో తయారు చేసినవే అని అమిత్ షా తెలిపారు. గత కాంగ్రెస్ పాలనకు భిన్నంగా మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం దేశ భద్రతకు కట్టుబడి ఉందని అన్నారు.
బీహార్‌లో ఆర్జేడీ 15 ఏళ్ల పాలనలో సివాన్‌లో బీభత్సం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ నుండి రాజకీయ నాయకుడిగా మారిన దివంగత మహ్మద్ షాబుద్దీన్‌ను ప్రశంసిస్తూ నినాదాలు చేశారనే ఆరోపణలపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌లపై షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లాలూ, అతని పార్టీ ‘షాహాబుద్దీన్ అమర్ రహే’, ‘జంగల్ రాజ్’ కలలు కంటున్నాయి కానీ బీహార్ ప్రజలు వీటిని అనుమతించరు అని షా అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




