Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking: డ్యూటీ టైమ్ ఓవర్.. విమానాన్ని మధ్యలోనే వదిలేసిన పైలట్స్.. ప్రయాణికుల ఆగ్రహం..

లండన్ నుండి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాన్ని పైలట్‌లు మధ్యలోనే వదిలేశారు. డ్యూటీ సమయం ముగిసిందని పైలట్స్ వెళ్లిపోయారు. ఇలా విమానాన్ని మధ్యలోనే వదిలేయడం సంచలనంగా మారింది. పైలట్స్ చర్యపై, ఎయిర్‌పోర్టు అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shocking: డ్యూటీ టైమ్ ఓవర్.. విమానాన్ని మధ్యలోనే వదిలేసిన పైలట్స్.. ప్రయాణికుల ఆగ్రహం..
Air India
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 26, 2023 | 10:19 AM

లండన్ నుండి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాన్ని పైలట్‌లు మధ్యలోనే వదిలేశారు. డ్యూటీ సమయం ముగిసిందని పైలట్స్ వెళ్లిపోయారు. ఇలా విమానాన్ని మధ్యలోనే వదిలేయడం సంచలనంగా మారింది. పైలట్స్ చర్యపై, ఎయిర్‌పోర్టు అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానం ఆరు గంటలకు పైగా జైపూర్ విమానాశ్రయంలోనే నిలిచిపోయింది. ఢిల్లీలో వాతావరణం అనుకూలంగా లేకపోవడం కూడా ఈ సమస్యకు ప్రధాన కారణంగా చెప్తున్నారు అధికారులు. దాంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చివరకు ప్రయాణికులను రోడ్డు మార్గంలో ఢిల్లీకి తరలించారు. వాస్తవానికి ఢిల్లీలో ప్రతికూల వాతావరణం కారణంగా ఆదివారం మూడు అంతర్జాతీయ విమానాలను, రెండు దేశీయ విమానాలను జైపూర్‌కు మళ్లించారు. వీటిలో ఎయిర్ ఇండియాకు చెందిన రెండు విమానాలు, స్పైస్‌జెట్‌కు చెందిన రెండు విమానాలు, గల్ఫ్ స్ట్రీమ్‌కు చెందిన ఒక విమానం ఉన్నాయి.

దారి మళ్లించిన విమానాలు..

ఎయిర్ ఇండియా విమానం AI-112 లండన్ నుండి ఉదయం 6:00 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో జైపూర్‌కు మళ్లించారు. రెండో ఎయిరిండియా విమానాన్ని ఢిల్లీ నుంచి దుబాయ్‌కు దారి మళ్లించారు. గల్ఫ్ స్ట్రీమ్ విమానం ఢిల్లీ నుంచి బహ్రెయిన్ వెళ్తుండగా, స్పైస్ జెట్ విమానం ఒకటి పూణే నుంచి ఢిల్లీకి వెళ్తుండగా, మరొకటి గౌహతి నుంచి వస్తోంది.

ఇవి కూడా చదవండి

విమానయాన మంత్రిని ట్యాగ్ చేస్తూ ట్వీట్స్..

విమానంలో ఉన్న బ్రిటిష్ ఇండియన్ ప్రయాణికుడు అదిత్.. ప్రయాణికులు పడుతున్న అవస్థలను పేర్కొంటూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్‌ రాథోడ్‌లను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘లండ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం AI112 ను వాతావరణ ప్రతికూలతల కారణంగా జైపూర్‌కు మళ్లించారు. అక్కడి నుంచి ప్రయాణికులు ఢిల్లీకి చేరుకోవడానికి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను చూపడం లేదు. సింధియా గారూ మాకు సహాయం చేయండి. జైపూర్ ఎయిర్‌‌పోర్ట్ అధికారుల నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు. పైలట్‌లు డ్యూటీ టైమ్ అయిపోయిందంటూ మధ్యలోనే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.’ అని ట్వీట్ చేశారు.

మొత్తానికి ఆరు గంటలకు పైగా నిరీక్షణ తరువాత ఎయిర్ ఇండియా కొంతమంది ప్రయాణికులను వోల్వో బస్సులో, మరికొందరిని క్యాబ్‌ల ద్వారా ఢిల్లీకి పంపింది. కాగా, విమానం దారిమళ్లించడం ద్వారా జైపూర్‌లో 150 మందికిపైగా ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. వారంతా విమానాశ్రయం వద్ద ఆగ్రహంతో తమ నిరసనను వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..