Watch Video: బంగారం దొంగిలించాడు.. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేశాడు.. షాకింగ్ వీడియో..
చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న మహిళ మెడలోంచి బంగారు చైన్ అపహరించిన స్నాచర్.. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేశాడు. ఆపై స్టేషన్ నుంచి పరుగులు తీశాడు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న మహిళ మెడలోంచి బంగారు చైన్ అపహరించిన స్నాచర్.. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేశాడు. ఆపై స్టేషన్ నుంచి పరుగులు తీశాడు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చెన్నైలోని తిరుముల్లైవాయల్ ప్రాంతానికి చెందిన వలర్మతి (43) అనే మహిళా ప్రయాణికుడి నుండి బంగారు గొలుసు లాక్కొని ప్లాట్‌ఫారమ్‌పై దొంగ పరుగెత్తుతున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.




చెన్నైలోని తిరుముల్లైవాయల్ ప్రాంతానికి చెందిన వలర్మతి రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జరీ విభాగంలో అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. విధులు ముగిసిన అనంతరం.. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్‌లో తిరువళ్లూరు తిరుగుపయనం అయ్యింది. ట్రైన్ బేసిన బ్రిడ్జ్ స్టేషన్‌లో ఆగింది. స్టేషన్ నుంచి ట్రైన్ మెల్లగా కదులుతున్న సమయంలో ఆమె వెనుక నిలబడి ఉన్న యువకుడు మెడలోంచి బంగారు చైన్ లాగేశాడు. కదులుతున్న ట్రైన్ నుంచి దూకేసి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ చోరీ ఘటన అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.
Chennai crime: CCTV visuals shows an unidentified thief snatched a gold chain from a moving train near Basin bridge railway station. #Viralvideo #Chennai #TamilNadu #Chainsnatching #Chennaicentral #train pic.twitter.com/h0gFV4WYWG
— RAMKUMAR R (@imjournalistRK) June 24, 2023
మరిన్ని జాతీయ వార్తలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి..