AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండె ఆగినంత పనైంది.. ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం.. కాంగ్రెస్ ఎంపీ సంచలన ట్వీట్..

ఎయిర్ ఇండియా విమానంలో ప్రాణాపాయ ఘటన జరిగిందని ఎక్స్ లో పోస్ట్ చేసారు కేసి వేణుగోపాల్.. తిరువనంతపురం నుంచి ఆలస్యంగా బయలుదేరడంతో పాటు విమాన ప్రయాణం భయానకంగా మారిందన్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో అల్లకల్లోలాన్ని ఎదుర్కొన్నామన్నారు.. విమానం బయలు దేరిన తరువాత దాదాపు గంట తర్వాత, కెప్టెన్ విమాన సిగ్నల్ లోపం ఉందని ప్రకటించి చెన్నైకి మళ్లించారు.

గుండె ఆగినంత పనైంది.. ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం.. కాంగ్రెస్ ఎంపీ సంచలన ట్వీట్..
Kc Venugopal
Gopikrishna Meka
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Aug 11, 2025 | 11:05 AM

Share

ఎయిర్ ఇండియాను వరుస సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి.. గుజరాత్ ప్రమాదం మర్చిపోకముందే చావు వరకు వెళ్లొచ్చాం అంటూ ఎంపీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలు ఎయిర్ ఇండియా ప్రయాణంపై ప్రయాణికుల్లో మరింత భయాన్ని రేకేస్తిసున్నాయి.. ఆదివారం తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళుతున్న AI 2455 ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. తిరువనంతపురం నుంచి ఢిల్లీ బయలుదేరిన విమానం రెండు గంటల పాటు గాల్లో ఉండి చెన్నైలో ల్యాండ్ అయింది. చెన్నైలో ల్యాండింగ్ అయ్యే సమయంలో రన్ వే పై మరో విమానం ఉందని ప్రయాణికులు భయాందోళనలకు లోనయ్యారని..పెద్ద ప్రమాదం తప్పిందని.. అదృష్టం కొద్ది బయటపడ్డామని విమానంలో ఉన్న కేసి వేణుగోపాల్ వెల్లడించారు

కేసి వేణుగోపాల్ ఏమన్నారంటే

ఎయిర్ ఇండియా విమానంలో ప్రాణాపాయ ఘటన జరిగిందని ఎక్స్ లో పోస్ట్ చేసారు కేసి వేణుగోపాల్.. తిరువనంతపురం నుంచి ఆలస్యంగా బయలుదేరడంతో పాటు విమాన ప్రయాణం భయానకంగా మారిందన్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో అల్లకల్లోలాన్ని ఎదుర్కొన్నామన్నారు.. విమానం బయలు దేరిన తరువాత దాదాపు గంట తర్వాత, కెప్టెన్ విమాన సిగ్నల్ లోపం ఉందని ప్రకటించి చెన్నైకి మళ్లించారు. దాదాపు రెండు గంటల పాటు విమానాశ్రయం చుట్టూ ల్యాండ్ కావడానికి అనుమతి కోసం ఎదురుచూశామన్నారు. ల్యాండ్ అయ్యే మొదటి ప్రయత్నంలోనే గుండె ఆగిపోయే క్షణం వచ్చిందని రన్‌వేపై మరొక విమానం ఉన్నట్లు సమాచారం అందిదన్నారు.. కెప్టెన్ త్వరగా విమానాన్ని పైకి లేపడంతో ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డట్లు వెల్లడించారు.. రెండవ ప్రయత్నంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందన్నారు. పైలట్ నైపుణ్యం అదృష్టం ద్వారా బతికామన్నారు. ప్రయాణీకుల భద్రత అదృష్టం మీద ఆధారపడి ఉండకూడదని.. సంఘటనను తక్షణమే దర్యాప్తు చేయాలని, జవాబుదారీతనాన్ని సరిదిద్దాలని ఇలాంటి లోపాలు మళ్లీ ఎప్పుడూ జరగకుండా చూసుకోవాలని డిజిసిఏ, విమానయాన శాఖ ను కోరారు. కేసి వేణుగోపాల్ పోస్ట్ పై ఎంపీ మణికం ఠాగూర్ సైతం స్పందిస్తూ ప్రయాణికుల భద్రత అదృష్టంపై ఆధారపడకూడదు. దీనికి ప్రధాని మోదీ, రామ్మోహన్ నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు..

ఎయిర్ ఇండియా స్పందన

కేసి వేణుగోపాల్, ఎంపీ మణికం ఠాగూర్ ప్రకటనపై ఎయిర్ ఇండియా స్పందించింది. ఎయిర్ ఇండియా AI 2455 అనుభవం కలవరపెట్టేదిగా ఉందని అర్థం చేసుకున్నామని.. విమాన మళ్లింపు వల్ల కేసి వేణుగోపాల్‌కి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని వివరణ ఇచ్చింది. అయితే ప్రయాణికుల భద్రత ఎల్లప్పుడూ తమ ప్రాధాన్యత అని వివరణ ఇచ్చింది. అనుమానిత సాంకేతిక సమస్య, చెడు వాతావరణ పరిస్థితుల కారణంగా చెన్నైకి విమాన మళ్లింపు ముందు జాగ్రత్త చర్య అని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.. రన్‌వేపై మరొక విమానం ఉండటం వల్ల కాదు, మొదటి ల్యాండింగ్ ప్రయత్నంలో చెన్నై ATC నుండి ఒక రౌండ్-అవుట్ సూచించబడింది. అటువంటి పరిస్థితులను నిర్వహించడానికి మా పైలట్లు శిక్షణ పొంది ఉన్నారని పేర్కొంది.. ల్యాండింగ్ సమయంలో వారు విమానం అంతటా ప్రామాణిక విధానాలను అనుసరించారు. ప్రయాణీకులు, సిబ్బంది భద్రత మా ప్రాధాన్యతగా ఉందని ఎయిర్ ఇండియా పేర్కొంది.

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలోఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఎటువంటి వివరణ ఇస్తారో చూడాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..