AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం.. భారత్‌తో యుద్ధం వస్తే అణుబాంబు వేస్తాం..: పాక్‌ ఆర్మీ చీఫ్‌

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ తన అమెరికా పర్యటనలో భారత్‌పై తీవ్రమైన అణ్వాయుధ బెదిరింపులు చేశారు. సింధు జలాల వివాదం, ఆనకట్ట నిర్మాణం వంటి అంశాలపై భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన హెచ్చరించారు. భారతదేశం తన ఉనికికి ముప్పు కలిగిస్తే, పాకిస్తాన్ సగం ప్రపంచాన్ని నాశనం చేస్తుందని మునీర్ హెచ్చరించారు.

సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం.. భారత్‌తో యుద్ధం వస్తే అణుబాంబు వేస్తాం..: పాక్‌ ఆర్మీ చీఫ్‌
Pakistan Army Chief Asim Mu
SN Pasha
|

Updated on: Aug 11, 2025 | 10:17 AM

Share

భారత్‌తో విభేదాల తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ రెండోసారి అమెరికాకు వెళ్లారు. అమెరికా నుంచి భారత్‌కు అణు బెదిరింపులు జారీ చేశారు. భవిష్యత్తులో భారత్‌ నుంచి తన దేశ ఉనికికి ముప్పు ఎదురైతే.. భారత్‌తో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ హెచ్చరించారు. టంపాలో పాకిస్తాన్ గౌరవ కాన్సుల్‌గా పనిచేస్తున్న వ్యాపారవేత్త అద్నాన్ అసద్ కోసం తాను ఏర్పాటు చేసిన బ్లాక్-టై విందు సందర్భంగా మునీర్ అమెరికా నేల నుండి ఈ అణు బెదిరింపులు చేశారు.

“మనది అణ్వస్త్ర దేశం, మనం పతనమవుతున్నామని అనుకుంటే, సగం ప్రపంచాన్ని కూడా మనతో పాటు తీసుకెళ్తాం” అని టంపాలో జరిగిన కార్యక్రమంలో మునీర్ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై మునీర్ భారత్‌ను లక్ష్యంగా చేసుకుని, నదీ జలాలు నిలిపివేయాలనే నిర్ణయం 250 మిలియన్ల మంది ప్రజలను ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని అన్నారు.

భారత్‌ ఆనకట్ట నిర్మించే వరకు మేం వేచి ఉంటాం, తర్వాత 10 క్షిపణులతో ఆనకట్టను కూల్చేస్తాం అని బెదిరింపులకు దిగారు. సింధు నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదు, మాకు క్షిపణుల కొరత లేదంటూ పేర్కొన్నారు. మునీర్ తన ప్రసంగంలో భారత్‌తో జరిగిన సంఘర్షణ గురించి అనేకసార్లు ప్రస్తావించారు. అయితే మునీర్‌ మాట్లాడిన కార్యక్రమానికి వచ్చే అతిథులు సెల్‌ఫోన్‌లు లేదా ఇతర డిజిటల్ పరికరాలను తీసుకెళ్లడం నిషేధించారు. ప్రసంగం అధికారిక ట్రాన్స్క్రిప్ట్‌ను విడుదల చేయలేదు. హాజరైన అనేక మంది చెప్పిన ఆధారంగా ది ప్రింట్ ఈ విషయాన్ని బయటపెట్టింది.

కాగా జూన్‌లో మునీర్ ఐదు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఒక ప్రైవేట్ విందులో పాల్గొన్నారు. ఇది సాధారణంగా దేశాధినేతలు లేదా ప్రభుత్వాధినేతలను సందర్శించడానికి ప్రత్యేకంగా చేసే అపూర్వమైన సంజ్ఞ. చమురు ఒప్పందంతో సహా వివిధ రంగాలలో అమెరికా-పాకిస్తాన్ సహకారాన్ని పెంచుతామని ట్రంప్ ప్రకటించడంతో ఆ సమావేశం ముగిసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి