Asaduddin Owaisi: మేమేం బీజేపీకి బీటీమ్ కాదు.. గుజరాత్‌ ఎన్నికల్లో పోటీచేస్తాం: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి మెజారిటీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు మజ్లిస్‌ ఎంపీ ఒవైసీ. బీజేపీకి తాము బీటీమ్‌ అన్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు.

Asaduddin Owaisi: మేమేం బీజేపీకి బీటీమ్ కాదు.. గుజరాత్‌ ఎన్నికల్లో పోటీచేస్తాం: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ
AIMIM chief Asaduddin Owaisi (File Photo)
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 23, 2022 | 8:00 AM

Gujarat Assembly Polls: ప్రధాని మోదీ సొంతగడ్డ గుజరాత్‌లో కూడా సత్తా చాటడానికి మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తహతహలాడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయన తరచుగా గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఆదివారం సూరత్‌లో జరిగిన ఆ పార్టీ సమావేశంలో ఎంఐఎం చీఫ్ అసద్ (Asaduddin Owaisi) పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ.. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. మిత్రపక్షాలతో కలిసి మెజారిటీ స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. బీజేపీకి బీటీమ్‌గా తమను కాంగ్రెస్‌ నేతలు విమర్శించడంపై మండిపడ్డారు ఒవైసీ. రాహుల్‌గాంధీ గత ఎన్నికల్లో పోటీ చేసిన అమేథీలో మజ్లిస్‌ అభ్యర్ధి బరిలో లేరని, అయినప్పటికీ కాంగ్రెస్ ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ద్రవ్యోల్భణం, నిరుద్యోగం లాంటి సమస్యలతో దేశం అల్లాడుతోందని అన్నారు ఒవైసీ. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్‌లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. మైనారిటీలు, ఆదివాసీలు దుర్భరజీవితాన్ని గడుపుతున్నారని తెలిపారు. బలమైన ప్రతిపక్షం బాధ్యతల నుంచి కాంగ్రెస్‌ వైదొలగిందని మండిపడ్డారు.

జ్ఞానవాపి మసీదు లాంటి వివాదం వచ్చినప్పుడు కేంద్రం వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ ఇప్పటికైన ఈ వ్యవహారంపై స్పందించాలని కోరారు. 1991 చట్టం ప్రకారం నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. జ్ఞానవాపి మసీదు లాంటి వివాదాలు సంఘ్‌పరివార్‌ జాబితాలో చాలా ఉన్నాయన్నారు. పాత గాయాలను తవ్వే కొద్దీ దేశంలో మరిన్ని కొత్త సమస్యలు వస్తాయని హెచ్చరించారు. ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తీరును సైతం ఓవైసీ తప్పుపట్టారు. ఢిల్లీలో అల్లర్లు జరుగుతున్న వేళ కేజ్రీవాల్‌ ప్రజల్లోకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీజేపీ అంటే భయపడే కేజ్రీవాల్‌ లాంటి నేతలు ప్రజలకు ఏం న్యాయం చేస్తారంటూ విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..