AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan – Gautam Adani: సీఎం జగన్‌తో గౌతమ్ అదానీ భేటీ.. దావోస్‌ వేదికగా పెట్టుబడులపై చర్చ..

దావోస్ పర్యటనలో సీఎం వైఎస్ జగన్.. అదానీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ గౌతమ్‌ అదానీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.

YS Jagan - Gautam Adani: సీఎం జగన్‌తో గౌతమ్ అదానీ భేటీ.. దావోస్‌ వేదికగా పెట్టుబడులపై చర్చ..
Ys Jagan Gautam Adani
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 22, 2022 | 7:44 PM

CM Jagan Davos Tour: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (WEF) సదస్సులో వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఆదివారం పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలతో భేటీ అయ్యారు. దీనిలో భాగంగా మొదట WEF వ్యవస్థాపకుడు క్లాజ్‌ స్వాబ్‌తో భేటీ అయి ఏపీలో పెట్టుబడులు పలు అంశాలపై మాట్లాడారు. ఆ తర్వాత జగన్.. అదానీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ గౌతమ్‌ అదానీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ – గౌతమ్‌ అదానీ పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జగన్‌ ఆయనకు జ్ఞాపికను అందజేశారు. దీంతోపాటు బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హాన్స్‌ పాల్‌, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే తదితరులతో సమావేశమయ్యారు.

వీరితో పాటు వరల్డ్ ఎకనమిక్‌ ఫోరం మొబిలిటీ, సస్టైనబిలిటీ విభాగాధిపతి పెట్రో గొమేజ్‌ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డబ్ల్యూఈఎఫ్‌తో ఫ్లాట్‌ఫాం పార్టనర్‌షిప్‌పై ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేకాకుండా హెల్త్‌ విభాగాధిపతి డాక్టర్‌ శ్యామ్‌ బిషేన్‌తో సీఎం జగన్‌ భేటీ అయి ఆరోగ్య రంగంపై చర్చలు జరిపారు.

ఇవి కూడా చదవండి

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సు ఆదివారం నుంచి 26 వరకు జరగనుంది. సందర్భంగా దావోస్‌లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌ని సీఎం జగన్‌ ప్రారంభించి జ్యోతిప్రజ్వాలన చేశారు. అనంతరం స్టాళ్లను పరిశీలించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..