Chandrababu: కళ్లెదుటే తిరుగుతున్నా అరెస్ట్ చేయ్యరా..? పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం..
డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యతో ఫోన్ చేసి మాట్లాడిన చంద్రబాబు.. ఈ కేసులో నిందితులకు శిక్షపడేంత వరకు అండగా ఉంటామని పేర్కొన్నారు. గర్భవతిగా ఉన్న అపర్ణకు వచ్చిన కష్టంపై చంద్రబాబు తీవ్ర అవేదన వ్యక్తం చేశారు.
MLC Driver Murder Case: హత్య కేసులో ఉండి.. బహిరంగంగా తిరుగుతున్నా.. ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చెయ్యకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలుగుదేశం, దళిత సంఘాలు చేసిన ఆందోళనల వల్ల ఈ కేసును హత్య కేసుగా మార్చారంటూ చంద్రబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో హత్యకు గురైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రమణ్యం కుటుంబాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం పరామర్శించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యతో ఫోన్ చేసి మాట్లాడిన చంద్రబాబు.. ఈ కేసులో నిందితులకు శిక్షపడేంత వరకు అండగా ఉంటామని పేర్కొన్నారు. గర్భవతిగా ఉన్న అపర్ణకు వచ్చిన కష్టంపై చంద్రబాబు తీవ్ర అవేదన వ్యక్తం చేశారు.
సుబ్రహ్మణ్యం హత్యకు అనంతబాబే కారణం అని ఈ సందర్భంగా అపర్ణ టీడీపీ అధినేతకు అపర్ణ వివరించింది. తెలుగుదేశంతో పాటు దళిత సంఘాలు చేసిన పోరాటం వల్లనే పోలీసులు చివరికి హత్య కేసుగా నమోదు చేశారని అపర్ణ చెప్పింది. తనను పోలీసులు తీవ్రంగా వేధించారని.. ప్రభుత్వం తనను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేసిందని, కేసును నీరు గార్చేందుకు ప్రయత్నం చేశారని ఆమె ఆరోపించింది. ఈ సమయంలో తన తరపున పోరాటం చేసిన తెలుగు దేశం నేతలకు అపర్ణ ధన్యవాదాలు తెలిపింది. ఇప్పటికీ పోలీసుల విచారణపై తనకు అనుమానాలు ఉన్నాయని.. తన భర్త హత్య కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని అపర్ణ డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దైర్యంగా ఉండాలని, అన్ని విధాలా పార్టీ తరపున అండగా ఉంటామని చంద్రబాబు అపర్ణకు తెలిపారు. నిందితుడు అనంత బాబు బహిరంగంగా తిరుగుతున్నా పోలీసులు అరెస్టు చెయ్యకపోవడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. కళ్లముందు పెళ్లిళ్లకు, పేరంటాలకు నిందితుడు వెళుతుంటే ఇప్పటికీ అరెస్టు చెయ్యకపోవడం బాధితుల అనుమానాలను బలపరిచేలా ఉందని చంద్రబాబు అన్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులుకు శిక్ష పడేవరకు టీడీపీ పోరాటం కొనసాగిస్తుందని చంద్రబాబు అపర్ణకు తెలిపారు.