YS Jagan: డబ్ల్యూఈఎఫ్‌ ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ భేటీ.. పెట్టుబడులే లక్ష్యంగా ఒప్పందాలు..!

WEF వ్యవస్థాపకుడు క్లాజ్‌ స్వాబ్‌తో.. వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున ఆయనకు నెమలి బొమ్మలతో కూడిన బహుమతిని సీఎం అందజేశారు.

YS Jagan: డబ్ల్యూఈఎఫ్‌ ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ భేటీ.. పెట్టుబడులే లక్ష్యంగా ఒప్పందాలు..!
Ys Jagan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 22, 2022 | 3:44 PM

YS Jagan Davos Tour: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఆదివారం నుంచి 26వ తేదీ వరకు జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దావోస్‌ చేరుకున్నారు. ఆయన వెంట మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, అమర్‌నాథ్‌, ఎంపీ మిధున్‌ రెడ్డి కూడా వచ్చారు. WEF వ్యవస్థాపకుడు క్లాజ్‌ స్వాబ్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున ఆయనకు నెమలి బొమ్మలతో కూడిన బహుమతిని సీఎం అందజేశారు. WEFతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకోనుంది. ఈ సాయంత్రం WEFలో జరిగే సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. కాగా.. శనివారం సాయంత్రం.. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్.. రోడ్డు మార్గంలో దావోస్‌కు వెళ్లారు. జ్యూరిక్‌ ఎయిర్‌పోర్టులో స్విట్జర్లాండ్‌లో ఉంటున్న తెలుగు ప్రజలు, రాష్ట్ర అధికారులు, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, సీఎం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆరోఖ్యరాజ్‌ తదితరులు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు.

వరల్డ్ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో ఏపీ.. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పరిశ్రమలకు అవసరమైన వనరులు, ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలు, డేటా షేరింగ్, ఉత్పత్తులకు విలువ జోడించడం లాంటి అంశాలపై ఒప్పందం చేసుకోనుంది. క్లాజ్‌ స్వాబ్‌తో భేటీ అనంతరం డబ్ల్యూఈఎఫ్‌ హెల్త్‌కేర్‌ చీఫ్ డాక్టర్‌ శ్యాం బిషేన్‌తో కూడా సీఎం జగన్ భేటీ కానున్నారు. బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హన్స్‌ పాల్‌బర్కనర్‌తో భేటీ అనంతరం డబ్ల్యూఈఎఫ్‌ కాంగ్రెస్‌ వేదికలో జరిగే వెల్‌కం రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరుకానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!