Telangana: అప్పుడు రికార్డు స్థాయిలో పెరిగాయి.. ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి.. నిమ్మ ధరల్లో విచిత్ర మార్పులు
రెండు నెలలుగా అదనంటూ కొండెక్కి కూర్చున్న నిమ్మ(Lemon) ధరలు ఇప్పుడు కిందికి దిగుతున్నాయి. వేసవి కాలంలో నిమ్మ రసం కూడా భాగ్యం లేకుండా చేసిన ధరలు ఇప్పుడు సడెన్ గా నేలచూపులు చూస్తున్నారు. మార్కెట్ లో నిమ్మ ధరలు....
రెండు నెలలుగా అదనంటూ కొండెక్కి కూర్చున్న నిమ్మ(Lemon) ధరలు ఇప్పుడు కిందికి దిగుతున్నాయి. వేసవి కాలంలో నిమ్మ రసం కూడా భాగ్యం లేకుండా చేసిన ధరలు ఇప్పుడు సడెన్ గా నేలచూపులు చూస్తున్నారు. మార్కెట్ లో నిమ్మ ధరలు రోజురోజుకూ దిగుజారుతున్నాయి. దిగుబడి పెరుగుతున్నా ధరలు పతనం అవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్ యార్డులో లూజు(బస్తా) ఒక్కటింటికి రూ.2,500 నుంచి రూ.4 వేల వరకు ధర పలుకుతోంది. ఏటా ఫిబ్రవరి నుంచి నిమ్మధరలు పెరుగుతుంటాయి. అయితే ఈ ఏడాది ఊహించని విధంగా బస్తా నిమ్మ ధర రూ.16 వేల వరకు పలికి రికార్డు సృష్టించింది. ధరలు పెరిగినా దిగుబడి లేకపోవడంతో రైతులకూ లాభం చేకూరలేదు. నెల రోజుల పాటు వీటి ధరలు నిలకడగా ఉన్నాయి. అయితే ఎక్కువ మంది రైతుల తోటల్లో సీజన్‌లో కాయల దిగుబడి లేక పోవడం వల్ల ఆదాయం పొందలేకపోయారు. పక్కతోటలో విరగ్గాస్తే తమ తోటలో కాయలు లేని విచిత్ర పరిస్థితి ఎదుర్కొన్నామని రైతులు తెలిపారు.
ప్రస్తుతం తోటల్లో కాయల దిగుబడి పెరిగినా ధరలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడి సైతం రావడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. తోటల నుంచి కాయలు యార్డుకు అధిక సంఖ్యలో వస్తుండడంతో వ్యాపారులు ఎగుమతి చేయడం కష్టంగా మారిందని చెబుతున్నారు. రెండు నెలలుగా నిమ్మకాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. దేశంలోని పలు నగరాల్లో నిమ్మకాయ కిలో రూ.350-400కి చేరింది. పెరిగిన నిమ్మకాయల ధరలతో వినియోగదారులే కాకుండా దుకాణదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా నిమ్మకాయలకు కొరత ఏర్పడింది.
నిమ్మకాయను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే దేశంలోని ప్రాంతాలు తీవ్రమైన వేడిగాలుల ప్రభావం ఎదుర్కోవడమే అతిపెద్ద కారణంగా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వేడిగాలుల కారణంగా నిమ్మ ఉత్పత్తి దెబ్బతింటోంది. పూత రాలిపోతోంది. బలమైన గాలులు, వేడి కారణంగా, నిమ్మ పువ్వులు రాలిపోవడం వల్ల ఉత్పత్తి దెబ్బతినడం ఒక పెద్ద కారణమని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీ చదవండి
Viral Video: ఇది రేసు గుర్రం కాదు.. పక్కా మాస్ డ్యాన్స్ గుర్రం.. వీడియో చూస్తే షాకవుతారు..