TSLPRB Fire Department Recruitment 2022: తెలంగాణ అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్ అర్హత..
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ చేసిన పోలీసు శాఖ.. తాజాగా అగ్నిమాపక శాఖలో ఖాళీగా ఉన్న 225 డ్రైవర్ ఆపరేటర్ (Driver Operator) పోస్టులను భర్తీ చేయడానికి..
TSLPRB Driver Operator Recruitment 2022 Notification: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ చేసిన పోలీసు శాఖ.. తాజాగా అగ్నిమాపక శాఖలో ఖాళీగా ఉన్న 225 డ్రైవర్ ఆపరేటర్ (Driver Operator) పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ఈ మేరకు మే 20న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి మే 21వ తేదీ ఉదయం 8 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. మే 26 రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ అని వివరించింది. 2022, జులై 1 నాటికి అభ్యర్ధుల వయసు 21 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. యూనీఫాం ఉద్యోగాలకు గరిష్ఠ వయో పరిమితి అయిదేళ్లు పెంచుతున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది కూడా. ఆసక్తి కలిగాన అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలని స్పష్టం చేసింది. నోటిషికేషన్ తేదీ నాటికి రెండేళ్లు.. అంతకంటే ముందు హెవీ మోటర్ వెహికిల్ లైసెన్స్ పొంది ఉండాలి. రిజర్వేషన్, తదితర పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సెట్‌లో చెక్ చేసుకోవచ్చని తెల్పింది.
పోస్టుల సంఖ్య: 225
పోస్టుల వివరాలు: డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు
వయోపరిమితి: జులై 1, 2022 నాటికి 21 – 25 ఏళ్ల మధ్య ఉండాలి. మే 20, 2022 ప్రకారం ప్రభుత్వ యూనిఫాం సర్వీసులకు మరో ఐదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఇచ్చింది.
పే స్కేల్: నెలకు రూ.31040 ల నుంచి రూ.92050 వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: ఇంటర్మీడియట్ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత. (లేదా) పదో తరగతితో పాటు ఆటో ఎలక్ట్రీషియన్/ మెకానిక్ మోటార్ వెహికిల్/ మెకానిక్ డీజిల్/ ఫిట్టర్ విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత. వాలిడ్ హెచ్‌ఎంవీ లైసెన్స్‌తో పాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్స్, డ్రైవింగ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. డ్రైవింగ్ టెస్ట్, రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
- ఓసీ/ బీసీ అభ్యర్థులు: రూ.800
- తెలంగాణకు చెందిన ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి.
దరఖాస్తులకు చివరి తేది: మే 26, 2022.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.