Harish Rao: పెట్రోల్‌పై పెంచింది బారణ.. తగ్గించింది చారాణ.. కేంద్రంపై మంత్రి హరీశ్ రావు ఫైర్

డాక్టర్లు సూది ఇచ్చినట్లు మెల్లిగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను మెల్లిగా పెంచిందని హరీశ్ రావు పేర్కొన్నారు. డీజిల్, పెట్రోల్ తగ్గించనట్లు చేస్తున్న ప్రచారం హంబక్, బోగస్ అంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

Harish Rao: పెట్రోల్‌పై పెంచింది బారణ.. తగ్గించింది చారాణ.. కేంద్రంపై మంత్రి హరీశ్ రావు ఫైర్
Harish Rao
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 22, 2022 | 2:51 PM

Harish Rao on central government: కేంద్రం పెట్రోల్‌పై పెంచింది బారణ… తగ్గించింది చారాణ.. అంటూ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. బీజేపీ నేతల పాలాభిషేకాలు ఎందుకోసమో అర్ధం కావడం లేదంటూ మంత్రి పేర్కొన్నారు. మార్చి 2014లో ఉన్న ధరను తెచ్చి మాట్లాడండి అంటూ బీజేపీ నేతలకు సూచించారు. పెట్రోల్, డీజిల్‌పై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పన్నులు విధించలేదని హరీశ్ రావు పేర్కొన్నారు. డాక్టర్లు సూది ఇచ్చినట్లు మెల్లిగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను మెల్లిగా పెంచిందన్నారు. డీజిల్, పెట్రోల్ తగ్గించనట్లు చేస్తున్న ప్రచారం హంబక్, బోగస్ అంటూ పేర్కొన్నారు. గ్యాస్ ధరలు పెంచి.. సిలిండర్ సబ్సిడీ ఎగ్గొట్టారంటూ బీజీపీ ప్రభుత్వంపై వివర్శలు గుప్పించారు. ఈ మేరకు హరీశ్ రావు ఆదివారం మాట్లాడారు. కరోనా కొత్త వేరియంట్ వల్ల ప్రమాదం లేదని.. ఒక్క కేసు మాత్రమే వచ్చిందని పేర్కొన్నారు. ఆ వ్యక్తి కాంటాక్ట్‌లను పరీక్షించామని.. ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదని హరీశ్ రావు పేర్కొన్నారు. గాంధీలో 25 కోట్ల విలువైన అత్యాధునిక టెక్నాలజీతో ఎంఆర్ఐ, 9 కోట్ల క్యాత్ లాబ్, సిటీ స్కాన్ పరికరాన్ని ప్రారంభించామని హరీశ్ రావు పేర్కొన్నారు. 100 కోట్లతో గాంధీ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. 30 కోట్లతో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ థియేటర్ సెంటర్ చేయబోతున్నాం. గాంధీలో 6 రకాల అవయవాలు మార్పిడి చేయనున్నట్లు పేర్కొన్నారు. అధునాతన యంత్రాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. సంతాన సాఫల్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మరో మూడు చోట్ల 7 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

అధునాతన కిచెన్ 2కోట్ల 70 లక్షలతో శంకుస్థాపన చేశామన్నారు. డ్రైనేజీ, ఫైర్ సేఫ్టీ, డ్రింకింగ్ వాటర్, పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగు పరుస్తామన్నారు. ఏపీలోని వెస్ట్ గోదావరి, పలుప్రాంతాల వారు, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ నుంచి రోగులు వచ్చి మోకాళ్ళ మార్పిడి చేయించుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం 1503 మంది రోగులు గాంధీలో చికిత్స పొందుతున్నారన్నారు. గాంధీలో లక్ష మంది కరోనా పాజిటివ్ రోగులకు వైద్యం అందించి దేశ రికార్డులకు ఎక్కిందని గుర్తుచేశారు. 1698 మంది గర్భిణీలకు వైద్యం అందించాము. 1160 మందికి బ్లాక్, వైట్ ఫంగస్ వైద్యం అందించామని తెలిపారు. 48 కేసులు నీ, హిప్ రీప్లేస్ మెంట్‌కు గాంధీ ఆర్థో డాక్టర్లు వైద్యం అందించారని హరీశ్ రావు తెలిపారు.

మూడు, నాలుగు లక్షల రూపాయల ఖర్చు అయ్యే మోకాళ్ళ చిప్పల మార్పిడిని ప్రభుత్వం ఉచితంగా చేస్తోందన్నారు. 25 రకాల గుండె శస్త్రచికిత్సలు, స్టాంట్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేస్తామన్నారు. ప్రజలు ప్రైవేటుకు వెళ్లి డబ్బు వృధా చేసుకోవద్దని సూచించారు. బస్తీ దవాఖానాలు వచ్చిన తర్వాత ఫీవర్ ఆసుపత్రి ఓపి 4 వేల నుంచి 400కు తగ్గిందని హరీశ్ రావు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి