Wedding Invitation: నాని పెళ్లి కార్డు వైరల్..! అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరుతో ఇదే తొలి శుభలేఖ..ముందుగా ముద్రించుకున్న వరుడు..
అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే ఈ జిల్లాకు డా.బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు కోరాయి. ఈ క్రమంలోనే అప్పుడే కొత్త జిల్లా పేరుతో ఓ యువకుడు
Dr BR Ambedkar: అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే ఈ జిల్లాకు డా.బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు కోరాయి. దీని కోసం పలుచోట్ల నిరసన, ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి. దీంతో కోనసీమ జిల్లా పేరులో డా.బి.ఆర్.అంబేద్కర్ పేరును చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మార్పుపై అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే అప్పుడే కొత్త జిల్లా పేరుతో ఓ యువకుడు తన పెళ్లి కార్డును ముద్రించుకున్నాడు. దాంతో డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరుతో వెలువడిన తొలి శుభలేఖగా ఇది చిరకాలం గుర్తుండిపోయేలా మారింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా చిరునామాతో తొలి శుభలేఖ(Wedding Invitation) వెలువడింది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన అంబేద్కర్ వాదులు..కోనసీమ జిల్లాకు అంబెడ్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టకముందే తన పెళ్ళి శుభలేఖ చిరునామాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ముద్రించుకున్నాడు నాని అనే యువకుడు. అయినవిల్లి మండలం విరవల్లిపాలెంకు చెందిన నాని వివాహం ఈనెల 26వ తేదీన జరగనుంది. పెళ్ళికి 15రోజుల క్రితం తన పెళ్ళి శుభలేఖలో అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ముద్రించుకుని బంధువులు,స్నేహితులకు కార్డ్స్ పంచిపెట్టారు. అయితే, ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం కోనసీమ జిల్లాగా ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నాడు వరుడు నాని. ప్రభుత్వం అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించడంపై సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు పెళ్ళికొడుకు నాని.
మొత్తానికి కొత్త జిల్లాగా ఏర్పాటైన అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరుతో ముద్రించిన తొలి శుభలేఖ ఇదే కావటంతో నాని పెళ్లి కూడా నెట్టింట వైరల్ అవుతోంది. కార్డు చూసిన బందుమిత్రులు, స్థానికులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పెళ్లి శుభాకాంక్షలు చెబుతున్నారు.