Pawan Kalyan: ప్రధాని మోడీ నిర్ణయం హర్షణీయం.. జగన్ ప్రభుత్వం కూడా ఇంధన ధరలను తగ్గించాలి: జనసేనానీ
పెట్రోల్, డిజీల్ ధరలు తగ్గించడం పేదలకు ఎంతో ఊరటనిస్తుందని.. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలంటూ పవన్ ట్విట్‌లో పేర్కొన్నారు.
Pawan Kalyan – PM Modi: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ నిర్ణయం హర్షణీయమని పవన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్విట్ చేశారు. ఎక్సైజ్ సుంకాన్ని (petrol and diesel prices) పెట్రోల్‌పై రూ. 8, డీజిల్‌పై రూ. 6 తగ్గించడం (లీటర్‌కు) సామాన్యులకు భారీ ఉపశమనం కలిగిస్తుందన్నారు. పీఎమ్ ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ సిలిండర్‌పై రూ.200 తగ్గించడం పేదలకు ఎంతో ఊరటనిస్తుందని పవన్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలంటూ పవన్ ట్విట్‌లో పేర్కొన్నారు.
ఏపీలో పెట్రోల్, డీజిల్‌పై సెస్సు అధికంగా ఉందని.. జగన్ ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించి ధరలు తగ్గించాలని పవన్ కోరారు. దీంతోపాటు వర్షాకాలానికి ముందు రోడ్లను బాగుచేయాలని పవన్ కల్యాణ్ AP ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే.. విద్యుత్, రోడ్లు, పలు సమస్యలపై ఏపీ ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
Reducing Excise duty by Rs 8 on petrol & Rs 6 on diesel (per litre) shall bring a huge relief to the Common Man. Thank you to the Leadership of Hon. PM Sri @narendramodi ji for taking this decision.
— Pawan Kalyan (@PawanKalyan) May 22, 2022
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..