Crime: తల్లీకూతళ్ల డెత్ మిస్టరీలో సంచలన విషయాలు.. ఫ్లాట్ మొత్తం గ్యాస్ ఛాంబర్‌గా మార్చేసి.. ఆ తర్వాత..
ఢిల్లీ వసంత్‌విహార్‌లో తల్లీ, ఇద్దరు కూతుళ్ల ఆత్మహత్య కేసులో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు అందరిని షాక్‌కు గురిచేస్తున్నాయి. తాము ఉంటున్న ఫ్లాట్‌ను మొత్తం గ్యాస్ ఛాంబర్‌గా మార్చేసి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Delhi suicides: ఢిల్లీ వసంత్ విహార్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంటి పెద్ద కరోనాతో చనిపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్ళిన ఆయన భార్య, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో వెల్లడయ్యింది. అయితే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న విధానమే ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆత్మహత్య చేసుకోవడానికి ఫ్లాట్‌ను గ్యాస్ ఛాంబర్‌గా మార్చేశారు తల్లీ కూతుళ్లు. అంతేకాకుండా వాళ్లు రాసిన సూసైడ్ లెటర్ కూడా పోలీసులనే షాక్‌కు గురిచేసింది. ఇంట్లో పోయ్యి వెలిగించి ఉందని, గ్యాస్‌సిలిండర్ కూడా ఓపెన్ చేసి ఉంది. ఇంటి నిండ విషవాయువు ఉంది. దయచేసి అగ్గిపుల్ల, లైటర్లు వెలిగించకండి” అని ఒక సూసైడ్ నోట్ రాసి ఉంది. అంతేకాదు వారు ఆత్మహత్య చేసుకునే పథకంలో భాగంగా ఇంటి కిటికీలను, తలుపులను పాలిథిన్ కవర్‌తో ప్యాక్ చేశారు. దీంతో వారు ఊపిరాడక చనిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
మృతులను 50 ఏళ్ల మంజు శ్రీవాత్సవ , ఆమె కూతుళ్లు అనిష్క , అంకుగా గుర్తించారు. కరోనా కారణంగా 2021 ఏప్రిల్‌లో తండ్రి చనిపోయాడని అప్పటి నుంచి కుటుంబం తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనైందని, పైగా తల్లి మంజు కూడా అనారోగ్యంతో మంచం పట్టి ఉండటంతో ఆ కుటుంబం ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వసంత్ అపార్ట్‌మెంట్ సొసైటీలోని ఓ గది లోపలి నుంచి తాళం వేసి ఉంది. ఐతే చుట్టుపక్కల ఫ్లాట్‌వాళ్లు తలుపులు కొడుతున్న తీయడం లేదంటూ అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పలీసులు సంఘటన స్థలానికి వచ్చి తలుపులు పగలు గొట్టి చూడగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విగతజీవులుగా పడిఉన్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..