Nani: పాన్‌ ఇండియా డైరెక్టర్‌తో నాని సినిమా.. వైరల్‌ అవుతోన్న వార్తలో నిజమెంతా.?

Nani: చిన్న హీరోగా కెరీర్‌ మొదలు పెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు న్యాచురల్‌ స్టార్‌ నాని. సినిమా సినిమాకు తనలోని వేరియేషన్‌ను మారుస్తూ టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ఒకరిగా మారాడు నాని...

Nani: పాన్‌ ఇండియా డైరెక్టర్‌తో నాని సినిమా.. వైరల్‌ అవుతోన్న వార్తలో నిజమెంతా.?
Follow us
Narender Vaitla

|

Updated on: May 23, 2022 | 6:25 AM

Nani: చిన్న హీరోగా కెరీర్‌ మొదలు పెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు న్యాచురల్‌ స్టార్‌ నాని. సినిమా సినిమాకు తనలోని వేరియేషన్‌ను మారుస్తూ టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ఒకరిగా మారాడు నాని. ఇక నాని ఎంచుకునే సినిమా కథాంశాలు కూడా విభిన్నంగా ఉంటాయి. తాజాగా ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో మంచి హిట్‌ను అందుకున్న నాని ప్రస్తుతం ‘అంటే సుందరానికి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు ‘దసరా’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా నాని తర్వాతి చిత్రంపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్‌ వైరల్‌ అవుతోంది.

నాని తర్వాతి చిత్రం ఓ పాన్‌ ఇండియా డైరెక్టర్‌తో చేయనున్నాడనేది సదరు వార్త సారంశం. ఇంతకీ ఆ డైరెక్టర్‌ మరెవరో కాదు. కేజీఎఫ్‌ అనే సినిమాతో యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని తనవైపు తప్పుకున్న ప్రశాంత్‌ నీల్‌. అవును ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోన్న వార్త ఇదే. ఈ సినిమాను కూడా హోంబలే ప్రొడక్షన్‌ హౌజ్‌ నిర్మించనుంది అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తికాగానే ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఆ సినిమా తర్వాత నానితో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుందని ఓ చర్చ జరుగుతోంది.

మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ. ఈ విషయం తెలిసిన నాని ఫ్యాన్స్‌ మాత్రం తెగ సంబురపడిపోతున్నారు. ఒకవేళ ఈ వార్తే నిజమైతే నాని తొలి పాన్‌ ఇండియా చిత్రం ఇదే కానుంది. ఇదిలా ఉంటే ప్రశాంత్‌ నీల్‌ మొదలు పెట్టిన సలార్‌, ఎన్టీఆర్‌ సినిమాలు రెండూ కేజీఎఫ్‌కు కొనసాగింపుగా ఉండనున్నాయనే ఓ చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై కూడా క్లారిటీ రావాలంటే కనీసం సలార్‌ ట్రైలర్‌ వచ్చేంత వరకైనా ఎదురు చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే