LIC Shares: పతనాన్ని కొనసాగిస్తున్న ఎల్ఐసీ షేర్.. ఇప్పుడు స్టాక్స్ ఉంచుకోవాలా లేక అమ్మేయాలా?

LIC Shares: ఎల్ఐసీ షేర్లు వస్తే చాలు తమ దశ తిరిగిపోతుందని అనేక మంది భావించారు. కానీ లిస్టింగ్ సమయంలోనే నిరాశ పరిచిన షేర్ ఆ పతనాన్ని కొనసాగిస్తోంది.

LIC Shares: పతనాన్ని కొనసాగిస్తున్న ఎల్ఐసీ షేర్.. ఇప్పుడు స్టాక్స్ ఉంచుకోవాలా లేక అమ్మేయాలా?
Lic
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 22, 2022 | 9:09 PM

LIC Shares: ఎల్ఐసీ షేర్లు వస్తే చాలు తమ దశ తిరిగిపోతుందని అనేక మంది భావించారు. కానీ లిస్టింగ్ సమయంలోనే నిరాశ పరిచిన షేర్ ఆ పతనాన్ని కొనసాగిస్తోంది. ఎల్ఐసీ షేర్ విలువ లిస్టింగ్ తరువాత నాలుగు రోజుల్లో దాదాపు గరిష్ఠమైన రూ. 919 నుంచి 10 శాతం మేర పడిపోయింది. ప్రస్తుతం ఈ షేర్ ధర రూ.825 వద్ద ఉంది. చివరి ట్రేడింగ్ సెషన్ లో షేర్ విలువ దాదాపు 15 రూపాయలు పతనమైంది. చాలా మంది ఇన్వెస్టర్లు ఇప్పుడు షేర్లను హోల్డ్ చేయాలా, లేక తక్కువ ధరలో మరిన్ని షేర్లను కొని రేట్ యావరేజ్ చేయాలా, లేకపోతే నష్టానికి అమ్మేయాలా అనే డైలమాలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీ ఒక్కో షేరును రూ.949 వద్ద ఎలాట్ చేసింది. ఈ లెక్కన కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.6 లక్షల కోట్లుగా ఉండాలి. కానీ.. ప్రస్తుతం షేర్ల పతనం కారణంగా మదుపరుల సంపద వేల కోట్లలోనే ఆవిరైపోయింది.

ద్రవ్యోల్బణంతో పాటు ఇతర అంతర్జాతీయ కారణాల రీత్యా మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ఆ ప్రభావం ఎల్ఐసీ షేర్లపై పడుతోందని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కంపెనీకి దేశంలో బీమా వ్యాపారంలో సింహ భాగం ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు. దీర్ఘకాలంలో షేర్ మళ్లీ పుంజుకుంటుందని ఆందోళన అవసరం లేదని వారు అంటున్నారు. మరో పక్క మ్యాక్విరీ సెక్యూరిటీస్ ఇండియా షేర్లపై న్యూట్రల్ స్టాండ్ కొనసాగిస్తోంది. రానున్న కాలంలో షేర్ విలువ రూ.1,000 వరకు చేరుకుంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. కంపెనీ ఫండమెంటల్స్ బలంగా ఉన్నందున త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని అభిప్రాయపడుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే