Gold Loan: తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ అందిస్తున్న బ్యాంకులు ఇవే.. పూర్తి వివరాలు..

Gold Loan: తక్కువ సమయంలో డబ్బు అవసరమైనప్పుడు అందరూ గోల్డ్ లోన్ తీసుకోవాలని అనుకుంటుంటారు. అనేక ప్రముఖ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు బంగారు రుణాలను ఆకర్షణీయమైన వడ్డీకే అందిస్తున్నాయి.

Gold Loan: తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ అందిస్తున్న బ్యాంకులు ఇవే.. పూర్తి వివరాలు..
Gold Loan
Follow us

|

Updated on: May 22, 2022 | 8:23 PM

Gold Loan: తక్కువ సమయంలో డబ్బు అవసరమైనప్పుడు అందరూ గోల్డ్ లోన్ తీసుకోవాలని అనుకుంటుంటారు. అనేక ప్రముఖ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు బంగారు రుణాలను ఆకర్షణీయమైన వడ్డీకే అందిస్తున్నాయి. గోల్డ్ లోన్‌లను ఎంచుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రుణాలు త్వరిత చెల్లింపులతో పాటు ఆకర్షించే వడ్డీ రేట్లతో వస్తాయి. గోల్డ్ లోన్ లభ్యతతో.. మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ఆర్థిక అవసరాలను సులభంగా తీర్చుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, బ్యాంకు మీ బంగారు ఆభరణాలను రుణ కాలానికి తాకట్టుగా తీసుకుంటుంది. చాలా బ్యాంకులు బంగారు ఆభరణాలను మాత్రమే అంగీకరిస్తాయి. బంగారం స్వచ్ఛత తప్పనిసరిగా 18 నుంచి 22 క్యారెట్ల మధ్య ఉండాలి. లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు బంగారు కడ్డీలు, బిస్కెట్లను అంగీకరించదు.. కేవలం ఆభరణాల రూపంలో ఉండే వాటిపైనే లోన్ ఇస్తుందని గుర్తుంచుకోవాలి. రిజర్వు బ్యాంక్ నిబంధనల ప్రకారం బంగారం విలువలో 75 శాతం వరకు మాత్రమే బ్యాంకులు లోన్ ఇవ్వాల్సి ఉంటుంది. 6 నెలల నుంచి గరిష్ఠంగా 24 నెలల వరకు లోన్ రీపేమెంట్ కాలపరిమితితో రుణాన్ని సులువుగా పొందవచ్చు.

ప్రముఖ బ్యాంకులు అందించే ఉత్తమ రేట్లు..

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: ఇది 7% వడ్డీ రేటుకు గోల్డ్ లోన్ అందిస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు GSTతో కలిపి మెుత్తం రూ. 500 నుంచి రూ. 2000 వరకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కెనరా బ్యాంక్: బ్యాంక్ ప్రస్తుతం 7.35% వడ్డీ రేటును అందిస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు రూ. 500 నుంచి రూ. 5000 వరకు ఉంటుంది.

యూనియన్ బ్యాంక్ : ప్రముఖ బ్యాంక్ మీకు 7.25% నుంచి 8.25% వడ్డీ రేటును అందిస్తుంది. దాని ప్రాసెసింగ్ ఫీజు విషయానికి వస్తే ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.

పంజాబ్ & సింధ్ బ్యాంక్: బ్యాంక్ 7% నుంచి 7.50% వరకు వడ్డీ రేటును అందిస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 10,000 వరకు ఉంటుంది.

PNB: ఇది బంగారు రుణాలపై 7% నుంచి 7.50% వరకు వడ్డీ రేటును అందిస్తుంది.

SBI బ్యాంక్: ఇది 3 సంవత్సరాల కాలవ్యవధికి రూ. 50 లక్షల వరకు రుణ మొత్తంతో 7.30% వడ్డీ రేటును అందిస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు GSTతో పాటు రుణ మొత్తంలో 0.50% కనిష్టంగా రూ. 500కి లోబడి ఉంటుంది.

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు