Fixed Deposit: FD రూల్స్ మార్చిన ఆర్బీఐ.. ఇలా చేసి అధిక రాబడిని పొందండి..

Fixed Deposit: RBI రెపో రేటును పెంచిన తర్వాత దాదాపు అన్ని ప్రధాన బ్యాంకులు FDల వడ్డీ రేట్లను పెంచాయి. ఈ తరుణంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెచ్చిన ఈ రూల్స్ తెలుసుకోకపోతే నష్టపోతారు.

Fixed Deposit: FD రూల్స్ మార్చిన ఆర్బీఐ.. ఇలా చేసి అధిక రాబడిని పొందండి..
Rbi
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 22, 2022 | 8:38 PM

Fixed Deposit: RBI రెపో రేటును పెంచిన తర్వాత దాదాపు అన్ని ప్రధాన బ్యాంకులు FDల వడ్డీ రేట్లను పెంచాయి. ప్రస్తుతం ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండే బ్యాంకు ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లు 2.90 నుంచి 6.70 శాతం వరకు ఉన్నాయి. కొన్ని NBFCలు ఇన్వెస్టర్లకు 7 శాతం కంటే ఎక్కువ రిటర్న్స్ కూడా ఇస్తున్నాయి. చాలా మంది ఇంతకు ముందు తెరిచిన FDని ఏమి చేయాలో అర్థం కాక ఆలోచనలో పడ్డాడు. ఈ సందిగ్ధత కేవలం మహేశ్ కి మాత్రమే కాకు చాలా మందికి ఉంది. RBI డేటా ప్రకారం డిసెంబర్ 2021 నాటికి, బ్యాంకుల్లో 89.56 లక్షల కోట్ల రూపాయల టర్మ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇటీవలే రేట్లు పెంచినందున ఈ డబ్బును డిపాజిట్ చేసిన లక్షల మంది తక్కువ వడ్డీ రేట్లు పొందుతున్నారు. ఇలా తక్కువ రాబడిని పొందుతున్న వారు తమ FDలపై ఎక్కువ రిటర్న్స్ పొందాలంటే ఏమి చేయాలో ఇప్పుడు చూద్దాం.

మీరు తక్కువ వడ్డీ రేటుతో FDని తెరిచి ఉంట, దానిపై అధిక రాబడిని పొందడానికి మీకు అనేక ఆప్షన్లు ఉన్నాయని బ్యాంకింగ్ నిపుణులు అనిల్ ఉపాధ్యాయ్ అంటున్నారు. ఈ FDని విత్ డ్రా చేసి అధిక వడ్డీ రేటు అందిస్తున్న FDలో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఈ సమయంలో కొన్ని బ్యాంకులు FDలను మధ్యలోనే విత్ డ్రా చేసినందుకు పెనాల్టీని వసూలు చేస్తాయని పెట్టుబడిదారులు తప్పక గుర్తుంచుకోవాలి. కాబట్టి.. తాజా FDని తెరవడానికి ముందు పెట్టుబడి సాధనానికి సంబంధించిన లాభాలు, నష్టాలతో పాటు వాటికి వర్తించే రూల్స్ కూడా తప్పక తెలుసుకోవాలని అనిల్ చెబుతున్నారు. ఎక్కువ వడ్డీ రేటుతో FDలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు సంపాదించే ఆదాయం కంటే పెనాల్టీ ఎక్కువగా ఉన్నట్లయితే.. ముందుగా FDని విత్ డ్రా చేయటంలో అర్థం లేదు. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం హటాత్తుగా డిపాజిట్లను క్లోజ్ చేసినందుకు ఎలాంటి పెనాల్టీలను వసూలు చేయవు. అటువంటి పరిస్థితిలో, ఇప్పటికే ఉన్న FDని బ్రేక్ చేసి ఆ సొమ్మును కొత్తగా అధిక వడ్డీని చెల్లిస్తున్న FDలో పెట్టుబడి పెట్టడం మంచి ఆప్షన్.

ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు, ప్రైవేట్ బ్యాంక్‌లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు వంటి అనేక రకాల బ్యాంక్‌లు ఉన్నాయి. వీటిలో ప్రైవేట్ రంగ బ్యాంకులు సేవింగ్స్, ఎఫ్‌డిలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఉజ్జీవన్, AU స్మాల్ ఫైనాన్స్ వంటి అనేక బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లలోని సొమ్ముపై సంవత్సరానికి 7% వరకు వడ్డీని అందిస్తున్నాయి. సేవింగ్స్ అకౌంట్లపై 10 వేల రూపాయల వరకు పొందే వడ్డీ ఆదాయానికి ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు లభిస్తుంది. గుర్తించాల్సింది ఏమిటంటే.. FDపై వచ్చే వడ్డీ పెట్టుబడిదారుడి వార్షిక ఆదాయానికి కలపటం జరుగుతుంది. టాక్స్ పేయర్ తన పన్ను శ్లాబ్ ఆధారంగా ఈ ఆదాయంపై పన్ను చెల్లించాలి. కాబట్టి 4-5 శాతం వడ్డీని అందించే FDని తెరవడం కంటే.. మీరు ఈ డబ్బును సేవింగ్స్ అకౌంట్ లో జమ చేయవచ్చు. పైగా మీరు అధిక వడ్డీని పొందవచ్చు. ఈ ప్రైవేట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద రిజిస్టర్ అయి ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మీ FD మెచ్యూరిటీ తేదీని అస్సలు మర్చిపోకండి. FDల నుంచి సంపాదించాలనుకుంటే కేవలం పెట్టుబడి పెట్టడం మాత్రమే సరిపోదు. RBI తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. FD మెచ్యూర్ అయినట్లయితే, కొన్ని కారణాల వల్ల దాని మొత్తం క్రెడిట్ కాకపోతే లేదా మీరు దానిని క్లెయిమ్ చేయకుంటే.. మీకు తక్కువ వడ్డీని బ్యాంక్ చెల్లిస్తుంది. ఇంతకు ముందు కస్టమర్ బ్యాంకులో చేసిన FD కాలపరిమితి ముగిసినప్పటికీ.. అతను డిపాజిట్ రెన్యూవల్ కోసం బ్యాంక్‌ని సంప్రదించినట్లయితే అదే కాల వ్యవధిలో బ్యాంక్ దాన్ని ఆటోమేటిక్‌గా రెన్యూవల్ చేసేది. అందువల్ల పెట్టుబడిదారు ఎఫ్‌డి మొత్తం కాల వ్యవధిలో ఒకటే వడ్డీ రేటును పొందేవారు. దీనివల్ల మెచూరిటీ సమయాన్ని పెట్టుబడిదారులు మరిచిపోయినా ఎటువంటి ఇబ్బంది కలిగేది కాదు. వారు పూర్తిగా రిలాక్స్‌గా ఉండేవారు. కానీ.. ఇప్పుడు పెట్టుబడిదారుడు FD మెచ్యూరిటీ తేదీని ముందుగానే గుర్తుంచుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి