AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple: ఉత్పత్తిని భారత్ షిఫ్ట్ చేయాలనుకుంటున్న యాపిల్ కంపెనీ..! ఎందుకంటే..

Apple: చైనా ఇటీవల కరోనా కట్టడికై జీరో పాలసీ కింద కఠినమైన లాక్‌డౌన్లు విధించింది. దీంతో టెక్ దిగ్గజం యాపిల్ తయారీ కార్యకలాపాలు స్తంభించాయి. ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని చైనా నుంచి తరలించాలని కంపెనీ యోచిస్తోంది.

Apple: ఉత్పత్తిని భారత్ షిఫ్ట్ చేయాలనుకుంటున్న యాపిల్ కంపెనీ..! ఎందుకంటే..
Apple
Ayyappa Mamidi
|

Updated on: May 22, 2022 | 8:06 PM

Share

Apple: చైనా ఇటీవల కరోనా కట్టడికై జీరో పాలసీ కింద కఠినమైన లాక్‌డౌన్లు విధించింది. దీంతో టెక్ దిగ్గజం యాపిల్ తయారీ కార్యకలాపాలు స్తంభించాయి. ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని చైనా నుంచి తరలించాలని కంపెనీ యోచిస్తోంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా దిగ్గజం చూపు భారత్, వియత్నాం వైపు మళ్లినట్లు తెలుస్తోంది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద కంపెనీగా అవతరించాలని చేస్తున్న ప్రయత్నాలకు కరోనా మహమ్మారి అవాంతరాలను కలిగిస్తోంది. ఎక్కువగా తన ఉత్పత్తుల తయారీకోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని కంపెనీ నిర్ణయించింది. దీనికి తోడు రష్యా చేస్తున్న యుద్ధానికి చైనా పరోక్ష మద్ధతు కూడా కంపెనీ నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం యాపిల్క కు చెందిన ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్స్‌లో 90 శాతం చైనాలోనే తయారవుతున్నాయి.

ప్రస్తుతం చైనాలో కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా ప్రస్తుత క్వార్టర్ లో కంపెనీ అమ్మకాలు 8 బిలియన్ డాలర్ల మేర తగ్గుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చైనా ప్రభుత్వ ఆంక్షల కారణంగా తమ ఇంజనీర్లు మరియు అధికారులు దాదాపు రెండేళ్లపాటు తయారీ సౌకర్యాల నుంచి నిషేధించబడ్డారని కంపెనీ తెలిపింది. దీనికి తోడు విద్యుత్ సమస్యలు వల్ల తయారీ తీవ్రంగా ప్రభావితమైందని కంపెనీ వెల్లడించింది. ప్రపంచంలో రెండవ అతి పెద్ద జనాభా కలిగిన భారత్ ను తమ తయారీకి సరైన ఎంపికగా కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మన దేశంలో కాంట్రాక్ట్ కంపెనీల ద్వారా ఉత్పత్తిని విస్తరించాలని యాపిల్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గడచిన సంవత్సరం మన దేశంలో తయారైన ఐఫోన్ ఉత్పత్తుల వాటా మెుత్తం తయారీలో 3.10శాతంగా ఉంది. ఈ సంవత్సరం అది 6-7 శాతంగా ఉండవచ్చని తెలుస్తోంది. మరో పక్క భారత్ తో ఉన్న మిలిటరీ సమస్యల కారణంగా చైనాలోని తయారీ దారులు వియత్నాం ను ఎంచుకోవచ్చని తెలుస్తోంది. మరోవైపు, ఆపిల్‌తో ఇప్పటికే తయారీ ఒప్పందాన్ని గెలుచుకున్న లక్సర్ ప్రెసిషన్ ఇండస్ట్రీ వియత్నాంలో ఎయిర్‌పాడ్‌లను తయారు చేస్తోంది.