Rakul Preet Singh: ప్రేమ వ్యవహారం గురించి బహిరంగంగా చెప్పింది అందుకే.. రకుల్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్..

Rakul Preet Singh: సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కాస్త ప్రైవసీ మెయింటెన్‌ చేయాలనుకుంటారు. ఎంత వరకు అవసరమో అంత వరకే చెబుతుంటారు. మరీ ముఖ్యంగా ప్రేమ వ్యవహారానికి...

Rakul Preet Singh: ప్రేమ వ్యవహారం గురించి బహిరంగంగా చెప్పింది అందుకే.. రకుల్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్..
Follow us
Narender Vaitla

|

Updated on: May 23, 2022 | 6:40 AM

Rakul Preet Singh: సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కాస్త ప్రైవసీ మెయింటెన్‌ చేయాలనుకుంటారు. ఎంత వరకు అవసరమో అంత వరకే చెబుతుంటారు. మరీ ముఖ్యంగా ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వివరాలను అంత సులువుగా బయట పెట్టారు. పెళ్లి దాక వచ్చిన తర్వాత కానీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. ఇటీవలి కాలంలో ఈ ట్రెండ్ ఎక్కువైంది.

అయితే వీరికి భిన్నంగా రకుల్‌ తన ప్రేమ వ్యవహారం గురించి ముందుగానే అభిమానులతో పంచుకుంది. బాలీవుడ్‌ నిర్మాత జాకీ భగ్నానీతో తాను ప్రేమలో ఉన్నానని సోషల్‌ మీడియా వేదికగా ప్రకంటిచిన విషయం తెలిసిందే. అయితే అలా చెప్పడానికి ఓ కారణముందని చెబుతోందీ బ్యూటీ.  తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రకుల్ ఈ విషయమై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ప్రేమలో పడటం చాలా సహజమైన విషయమని, దాని గురించి దాల్చాసిన అవసరం కానీ ఏవో ఊహాగానాలు చేసుకోవడం కానీ తనకు ఇష్టం లేదని చెప్పింది రకుల్‌. ఇక తాను ప్రేమలో పడిన తొలిరోజుల్లోనే ఎలాంటి దాపరికం లేకుండా తమ బంధం గురించి అందరికి చెప్పాలని నిర్ణయించుకున్నాం అని చెప్పుకొచ్చింది రకుల్‌. తన ప్రేమ వ్యవహారాన్ని అందరితో పంచుకోవడమే మంచిదైందని తెలిపిన రకుల్‌, ఒకవేళ తమ ప్రేమ వ్యవహారాన్ని దాటి పెట్టి ఉంచితే మీడియాలో వచ్చే రకరకాల కథనాలతో మనశ్శాంతి కరువయ్యేదని అసలు సీక్రెట్‌ బయటపెట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..