Petrol Diesel Price Today: స్థిరంగా పెట్రోల్, డీజిల్‌ రేట్లు.. వ్యాట్ తగ్గిస్తున్నట్లు ప్రకటించిన రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు..

Petrol Diesel Rate Today: ఈరోజు చమురు మార్కెటింగ్ కంపెనీల తరపున ధరలో ఎలాంటి మార్పు లేదు. కేంద్రం అభ్యర్థన మేరకు పలు రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గించాయి. కేంద్రం ప్రకటన తర్వాత రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.

Petrol Diesel Price Today: స్థిరంగా పెట్రోల్, డీజిల్‌ రేట్లు.. వ్యాట్ తగ్గిస్తున్నట్లు ప్రకటించిన రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 23, 2022 | 6:56 AM

ఈరోజు చమురు మార్కెటింగ్ కంపెనీల తరపున ధరలో ఎలాంటి మార్పు లేదు. కేంద్రం అభ్యర్థన మేరకు పలు రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గించాయి. కేంద్రం ప్రకటన తర్వాత రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72కి చేరుకోగా, డీజిల్ ఈరోజు లీటరుకు రూ.89.62కి విక్రయిస్తున్నారు. ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.109.27గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.95.84కి అమ్ముతున్నారు. కోల్‌కత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03 ఉండగా, చెన్నైలో లీటరు రూ.102.63గా ఉంది. డీజిల్ ధర కోల్‌కతాలో రూ.92.76, చెన్నైలో లీటరు రూ.94.24గా ఉంది. కేంద్ర ప్రభుత్వ ప్రకటన తర్వాత రాజస్థాన్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.2.48, డీజిల్‌పై రూ.1.16 చొప్పున వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటర్‌కు రూ.2.41, డీజిల్‌పై రూ.1.36 చొప్పున వ్యాట్‌ను తగ్గించింది. ఒడిశా ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.2.23, డీజిల్‌పై రూ.1.36 వ్యాట్‌ను తగ్గించింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్‌పై లీటర్‌కు రూ.2.08, డీజిల్‌పై రూ.1.44 చొప్పున వ్యాట్‌ను తగ్గించింది.

ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికలో హాంకాంగ్, జర్మనీ, యుకె వంటి దేశాల కంటే భారతదేశంలో పెట్రోల్ చౌకగా ఉందని, చైనా, బ్రెజిల్, జపాన్, యుఎస్ఎ, రష్యా, పాకిస్తాన్, శ్రీలంక వంటి దేశాల కంటే తక్కువ ధర అని నివేదికలో పేర్కొన్నారు. తెలంగాణ విషయానికొస్తే హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్ ధర రూ. 109.66 ఉండగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ. 97.82 ఉంది. వరంగల్‌లో పెట్రోల్ 109.66, డీజిల్‌ 97.82, కరీంనగర్‌లో లీటర్‌ పెట్రోల్ ధర రూ. 109.66 ఉండగా డీజిల్‌ ధర 97.82గా ఉంది. ఇండియన్ ఆయిల్ భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం వివిధ నగరాల పెట్రోల్, డీజిల్ ధరల సమాచారాన్ని అప్‌డేట్ చేస్తాయి. మీరు ప్రతిరోజూ మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా తెలుసుకోవచ్చు. మీరు హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు తెలుసుకోవాలంటే RSP 134483 అని టైప్ చేసి 9224992249 ఫోన్ నెంబర్‌కు మెసేజ్‌ (Message) పంపితే ధరల వివరాలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే