Agnipath protest: కేంద్రం యువత గొంతును నొక్కేస్తుంది.. అగ్నిపథ్‌ పథకంపై సోనియా కీలక వ్యాఖ్యలు

Agnipath protest: ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మిలటరీ-రిక్రూట్‌మెంట్ స్కీమ్‌పై నిరసనలు వెల్లువెత్తుతున్నందున పౌరులు ప్రశాంతంగా ఉండాలని, శాంతిని కాపాడాలని కాంగ్రెస్‌..

Agnipath protest: కేంద్రం యువత గొంతును నొక్కేస్తుంది.. అగ్నిపథ్‌ పథకంపై సోనియా కీలక వ్యాఖ్యలు
Sonia Gandi
Follow us
Subhash Goud

|

Updated on: Jun 18, 2022 | 5:31 PM

Agnipath protest: ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మిలటరీ-రిక్రూట్‌మెంట్ స్కీమ్‌పై నిరసనలు వెల్లువెత్తుతున్నందున పౌరులు ప్రశాంతంగా ఉండాలని, శాంతిని కాపాడాలని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ కోరారు. అగ్నిపథ్ కు దిశానిర్దేశం లేదని సోనియా గాంధీ లేఖలో తెలిపారు. అగ్నిపథ్ పై ఓ లేఖ రాశారు. ప్రభుత్వం మీ గొంతును విస్మరించి, పూర్తిగా దిశానిర్దేశం చేసే కొత్త పథకాన్ని ప్రకటించినందుకు నేను విచారంగా ఉన్నాను.. అహింసా మార్గంలో శాంతియుతంగా నిరసన తెలియజేయాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం కొత్త సాయుధ దళాల రిక్రూట్‌మెంట్ విధానాన్ని ప్రకటించడం దురదృష్టకరం. ఇది పూర్తిగా దిక్కులేనిది, మీ గొంతులను విస్మరిస్తూ అలా చేసిందని యువతను ఉద్దేశించి హిందీలో ఒక ప్రకటనలో ఆమె అన్నారు.

వారికి తన పార్టీ మద్దతు ప్రకటిస్తూ, యువకులతో పాటు పలువురు మాజీ సైనికులు, రక్షణ రంగ నిపుణులు ఈ పథకాన్ని ప్రశ్నించారని కాంగ్రెస్ అధ్యక్షురాలు తెలిపారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్, పోస్ట్-కోవిడ్ లక్షణాలతో ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనియాగాంధీ.. అగ్నిపథ్‌పై స్పందించారు. యువతకు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని అన్నారు. మీ ప్రయోజనాల కోసం, ఈ పథకాన్ని ఉపసంహరించుకోవడం కోసం పోరాడతామని ఆమె హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

యువత వాయిస్ ను కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అగ్నిపథ్ పై యువత వాయిస్ ను పరిగణలోకి తీసుకోవాలన్నారు. కేంద్రం అగ్నిపథ్ ను తక్షణమే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆర్మీలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ, కొత్త ఉద్యోగాల నియామకంలో మూడేళ్లు జరుగుతున్న జాప్యంపై యువత మనోవేదనను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ఎయిర్‌ఫోర్స్‌లో ప్రవేశానికి టెస్ట్‌లు రాసి ఫలితాలు, నియామకాల కోసం యువత ఎదురుచూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ పూర్తి శక్తిసామర్థ్యాలతో యువతకు అండగా నిలుస్తుందని ఆమె అన్నారు. అగ్నిపథ్‌ను ఉపసంహరించుకునే వరకు తమ పార్టీ పోరాడుతుందని తెలిపారు. అంతకు ముందు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి