Agnipath: దేశ వ్యాప్త నిరసనల నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు.. అగ్నిపథ్‌ స్కీమ్‌లో పలు మార్పులు..

Agnipath: దేశ రక్షణ రంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టి అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే...

Agnipath: దేశ వ్యాప్త నిరసనల నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు.. అగ్నిపథ్‌ స్కీమ్‌లో పలు మార్పులు..
Follow us

|

Updated on: Jun 18, 2022 | 4:43 PM

Agnipath: దేశ రక్షణ రంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టి అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆందోళనలకు చల్లార్చే దిశగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే శనివారం అగ్నిపథ్‌ పథకంలో పలు మార్పులు చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పలు విషయాలను వెల్లడించారు.

రెండేళ్లుగా ఆర్మీలో నియామకాలు జరగని కారణంగా అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో ఈ ఏడాది ప్రకటించే అగ్నిపథ్‌ నోటిఫికేషన్‌లలో అభ్యర్థుల వయో పరిమితిని 18 నుంచి 23 ఏళ్లుగా నిర్ణయించారు. నిజానికి గరిష్ట వయోపరిమితి 21 ఏళ్లు ఉండగా ఈ ఒక్క ఏడాది మాత్రమే 23 ఏళ్లకు పొడగించారు. అంతేకాకుండా నాలుగేళ్ల పాటు ఆర్మీలో సేవలందించి బయటకు వచ్చిన అగ్ని వీర్‌లకు కేంద్ర బలగాల్లోకి, అలాగే అస్సాం రైఫిల్స్ లోకి వెళ్లే అవకాశం కూడా కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి

ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివిలియన్ పోస్టులు, అన్ని 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లలో చేర్చుకోవడానికి పది శాతం రిజర్వేషన్ ఇస్తామని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఇది వరకే ఉన్న రిజర్వేషన్‌కు తోడు ఇది అదనంగా ఉంటుందని వివరించారు. ఇందుకు సంబంధించిన సవరణలు రిక్రూట్‌మెంట్ రూల్స్‌లో తీసుకువస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. మరి కేంద్రం తెలిపిన ఈ సవరణలతోనైనా ఆందోళనలు శాంతిస్తాయో చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..