AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol-Diesel Crisis: ఇప్పుడు 24 గంటల పాటు పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉండదా..? కేంద్రం కీలక నిర్ణయం..!

Petrol-Diesel Crisis: దేశవ్యాప్తంగా పెట్రోలు , డీజిల్ సంక్షోభం కొనసాగుతోంది. పెట్రోలు పంపుల్లో ఇంధనం కరువవుతోంది. దీని కారణంగా చాలా రాష్ట్రాల్లో పరిమిత సమయం వరకు విక్రయిస్తున్నారు..

Petrol-Diesel Crisis: ఇప్పుడు 24 గంటల పాటు పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉండదా..? కేంద్రం కీలక నిర్ణయం..!
Subhash Goud
|

Updated on: Jun 18, 2022 | 3:35 PM

Share

Petrol-Diesel Crisis: దేశవ్యాప్తంగా పెట్రోలు , డీజిల్ సంక్షోభం కొనసాగుతోంది. పెట్రోలు పంపుల్లో ఇంధనం కరువవుతోంది. దీని కారణంగా చాలా రాష్ట్రాల్లో పరిమిత సమయం వరకు విక్రయిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ పరిధిని విస్తరించింది. ఇది ప్రైవేట్, ప్రభుత్వ కంపెనీలకు వర్తిస్తుంది. ఇది దేశంలోని ప్రతి ప్రాంతంలో అమలు చేయబడింది. ప్రస్తుతం ఈ నిబంధన ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ నిబంధన ప్రకారం.. పెట్రోల్‌ పంపు రిటైలర్లను తెరిచి మూసివేయాలన్నా ప్రభుత్వ సూచనలను పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ప్రకటించిన సమయాల ప్రకారం.. పెట్రోల్ పంప్ ఆపరేటర్లందరూ పెట్రోల్ పంపులను సమయాలను పాటించాల్సి ఉంటుంది. ఈ సమయంలో తగినంత పెట్రోల్‌, డీజిల్‌ను సరఫరా చేయాలి. ప్రతి కంపెనీ తన వద్ద తగినంత చమురు నిల్వ ఉంచుకోవాలి. ప్రైవేట్ చమురు మార్కెటింగ్ కంపెనీలు రిటైల్ సరఫరాను 50 శాతానికి పైగా తగ్గించాయి. దీంతో ప్రభుత్వ పెట్రోలు పంపులపై ఒత్తిడి పెరిగింది.

రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి వేలాది పెట్రోల్ పంపుల స్టాక్ పూర్తిగా ఖాళీగా ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తమకు సరిపడా సరఫరా చేయడం లేదని వాపోతున్నారు. దేశంలో చమురు మార్కెటింగ్‌కు మూడు ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. అవి ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం. అంతే కాకుండా హర్యానాలోని ఫరీదాబాద్, గురుగ్రామ్‌లో చమురు సంక్షోభం ప్రభావం కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ సమస్య కూడా తలెత్తింది. పంజాబ్‌, కర్ణాటక, హిమాచల్‌ వంటి రాష్ట్రాల నుంచి కూడా పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేదు:

ఇవి కూడా చదవండి

పెట్రోలు-డీజిల్ ధర ఈరోజుతో స్థిరపడి 28 రోజులు అయ్యింది. మే 21న పెట్రోల్, డీజిల్‌పై విధించే ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మే 22న దేశవ్యాప్తంగా చమురు ధరల్లో చివరి మార్పు జరిగింది. ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోలు ధర రూ.111.35 కాగా, డీజిల్ ధర రూ.97.28గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24గా విక్రయిస్తున్నారు. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.66గా ఉండగా.. డీజిల్‌ ధర రూ.97.82 ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన