Mukesh Ambani: కాస్మొటిక్స్ రంగంలోకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌..! రెవ్లాన్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిన ముఖేశ్ అంబానీ..!

దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్ని రంగాల్లో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీలను సొంత చేసుకున్న ముఖేష్ అంబానీ తాజాగా మరో కంపెనీని సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు...

Mukesh Ambani: కాస్మొటిక్స్ రంగంలోకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌..! రెవ్లాన్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిన ముఖేశ్ అంబానీ..!
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 18, 2022 | 12:49 PM

దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్ని రంగాల్లో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీలను సొంత చేసుకున్న ముఖేష్ అంబానీ తాజాగా మరో కంపెనీని సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అమెరికాకు చెందిన కాస్మెటిక్స్ సంస్థ రెవ్లాన్‌ను సొంతం చేసుకునేందుకు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ఇప్పటికే దివాలా పిటిషన్‌ దాఖలు చేసిన రెవ్లాన్ కొనుగోలు చేసే అంశాల్ని రిలయన్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విషయంపై రిలయన్స్, రెవ్లాన్ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. బిడ్డింగ్స్‌ దాఖలుకు రిలయన్స్ సంప్రదింపులు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. గ్లోబల్ సరఫరా గొలుసు అంతరాయాలు ముడిసరుకు ఖర్చులను పెంచి, ముందస్తు చెల్లింపులను డిమాండ్ చేసేలా విక్రేతలను ప్రేరేపించిన తర్వాత ఈ వారం ప్రారంభంలో రెవ్‌లాన్ దివాలా కోసం దాఖలు చేసినట్లు నివేదిక ఎకానమిక్స్ టైమ్స్‌ పేర్కొంది.

టెలికాం, ఇంధనం, రిటైల్‌ రంగాల్లో దూసుకుపోతున్న రిలయన్స్ వ్యక్తిగత కాస్మొటిక్స్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించడానికి రెవ్లాన్‌ కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా రిలయన్స్ భారీ విస్తరణ వ్యూహాల్లో ఉంది. ఇందులో భాగంగా జాతీయంగా అంతర్జాతీయంగా పలు కంపెనీల కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తోంది. అపోలోతో పాటు, యూకే-ఫార్మసీ చైన్ బూట్స్‌ను సొంతం చేసుకోవడానికి ఇప్పటికే బిడ్‌ వేసినట్లు తెలిసింది. మరోవైపు ఈ ఏడాది ప్రారంభంలో డన్జోలో రిలయన్స్ వాటా కొనుగోలు చేసింది. రెవ్లాన్‌ చార్లెస్‌ అండ్‌ బ్రదర్స్‌ నేతృత్వంలోని 1932లోఏర్పాటైన కాస్మొటిక్స్ కంపెనీ ఇది. నెయిల్ పాలిష్‌లు, లిప్‌స్టిక్‌లకు పేరుగాంచింది. ఎలిజబెత్ అర్డెన్, ఎలిజబెత్ టేలర్ పేరుతో స్కిన్ కేర్, మేకప్, పెర్‌ఫ్యూమ్స్ విక్రయిస్తుంది.