Mastercard: ఆర్బీఐ గుడ్‌న్యూస్.. ఆ ఆంక్షలు ఎత్తివేత.. కొత్త కార్డులు జారీ చేసుకోవచ్చు..!
Mastercard: అమెరికా పేమెంట్స్ దిగ్గజం మాస్టర్‌కార్డులపై విధించిన ఆంక్షలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎత్తివేసింది. కొత్త క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డులను జారీ చేయకుండా మాస్టర్ కార్డులపై ..
Updated on: Jun 17, 2022 | 9:16 AM

Mastercard: అమెరికా పేమెంట్స్ దిగ్గజం మాస్టర్‌కార్డులపై విధించిన ఆంక్షలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎత్తివేసింది. కొత్త క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డులను జారీ చేయకుండా మాస్టర్ కార్డులపై 2021 జూలై 14న ఆర్బీఐ ఆంక్షలు విధించింది. దాదాపు ఏడాది తర్వాత ఆంక్షలను వెనక్కి తీసుకుంది ఆర్బీఐ. తక్షణమే ఈ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

పేమెంట్ సిస్టమ్ డేటా స్టోరేజీ విషయంలో ఆర్బీఐ సర్క్యూలర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు మాస్టర్‌కార్డుపై ఈ నిషేధం విధించింది. అప్పటి నుంచి మాస్టర్ కార్డు డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డులు జారీ కాలేదు.

ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. అన్ని విదేశీ పేమెంట్ కంపెనీలు తమ కస్టమర్లకు చెందిన డేటాను తప్పనిసరి భారత్‌లోనే రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 2018న ఈ నిబంధనలను తీసుకొస్తూ ఆర్బీఐ ఓ సర్క్యూలర్‌ణు జారీ చేసింది. ఆరు నెలల లోపల పేమెంట్ సిస్టమ్స్ మొత్తం డేటాను కేవలం ఇండియాలోనే స్టోర్ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది.

మాస్టర్‌కార్డుతో పాటు అమెరికాకు చెందిన వీసా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన రూపేలు కూడా భారత్‌లో కార్డు నెట్‌వర్క్స్‌ను కొనసాగిస్తున్నాయి. ఇండియాలో లైసెన్స్ పొందిన అన్ని పేమెంట్ కంపెనీలు సీఈవోలకు ఈ నోటీసులు జారీ చేస్తూ డేటా స్టోరేజ్ రూల్స్‌ను మరింత కఠినతరం చేసింది.




