- Telugu News Latest Telugu News Optical Illusion: There are 16 tigers in this image; can you find them all?
Optical Illusion: మీ దృష్టికి, మేధస్సుకు సవాల్.. ఇందులో దాగున్న 16 పులులను 30సెక్షన్లలో కనిపెడితే.. మీ ఐక్యూ అదుర్స్
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్ .. అంటే చిత్రం కలిగించే భ్రమలు.. ఇలాంటి ఫోటోలు చూడడానికి దానిలోని ఉన్న చిత్రవిచిత్రాలను కనిపెట్టడానికి ప్రయత్నించడానికి సరదాగా ఉంటుంది. దీనివలన మెదడు, దృష్టి సమన్వయం చేసే విధానం అలవడుతుంది. . ఆప్టికల్ చిత్రాన్ని చూసిన కొద్ది సెకన్లలోనే విషయాలను వేరే పద్ధతిలో చూడటం అలవాటు అవుతుంది.
Updated on: Jun 17, 2022 | 11:41 AM

ఈ ఫొటోలో మొదటి చూపులో రెండు పెద్ద పులులు,రెండు పిల్లలతో కూడిన పులి కుటుంబం కనిపిస్తుంది. అయితే వాస్తవానికి ఈ చిత్రంలో 16 పులులు ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉందా? మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రంలో పొందుపరిచిన అన్ని పులులను 30 సెకన్లలో చాలా మంది గుర్తించలేకపోయారు. వాటిలో కొన్ని గుర్తించడం చాలా కష్టం.. కొన్ని గంటలు ప్రయత్నించినా కూడా విఫలమయ్యారు

ఫోటో చూసిన వెంటనే ముందుగా నాలుగు పులులను అందరూ గుర్తిస్తారు. రెండు పెద్ద పులులు రెండు పిల్లలతో సూర్యుడు అస్తమించడంతో ఒక రాయిపై కూర్చున్నాయి. ఫోటో చూసిన వెంటనే ముందుగా నాలుగు పులులను అందరూ గుర్తిస్తారు. రెండు పెద్ద పులులు రెండు పిల్లలతో సూర్యుడు అస్తమించడంతో ఒక రాయిపై కూర్చున్నాయి.

మరికొంచెం ఏకాగ్రతతో చూస్తే మరో నాలుగు పులులను చూడవచ్చు. ఇప్పుడు మీదృష్టిని ఈ చిత్రంలోని అతి పెద్ద చిత్రం పై పెట్టండి. అది ఒక చెట్టు. ఆ చెట్టులోనే నాలుగు పులులు ఉన్నాయి. పైభాగాన్ని గుర్తించడం సులభం అయితే, దిగువ గుర్తించడం కొంచెం కష్టం. ఇప్పుడు మీ కళ్లను చెట్టు పైభాగానికి తరలించండి. అస్తమించే సూర్యుని పక్కన ఒకటి పులి, ఈ పక్కన మరొకటి పులిని గుర్తిస్తారు.

ఇప్పుడు మనసుని కూడా లగ్నం చేసి.. పులులను వెదకండి.. మరో మూడు దాగి ఉన్న పులులు కనిపిస్తాయి. వాటిలో రెండు పులి పిల్లలుపెద్దపులి కూర్చున్న పాదాల క్రింద రాళ్లపై ఉన్నాయి. నిల్చున్న పెద్దపులి పక్కనే దాగిన మూడో పులి కనిపిస్తుంది.

ఈ సారి మిగిలిన ఫులులను గుర్తించడం అత్యంత క్లిష్టమైన పని. మిగిలిన 5 పులులను గుర్తించడం చాలా కష్టం. అవి చాలా తెలివిగా చిత్రంలోని అన్ని అంశాలలో పొందుపరచబడ్డాయి. మొదటి చూపులో వాటిని గుర్తించడం చాలా కష్టం.

ఆప్టికల్ చిత్రాలు మనస్సును ఒకొక్కసారి కళ్ళను కూడా మోసం చేస్తాయి. ముందుగా అందులో దాగిఉన్న చిత్రాలు దృష్టి పరిధిలోకి రావు. ఒక వ్యక్తి ఆప్టికల్ భ్రమను పరిష్కరించగల విధానం అతని స్థాయి వ్యక్తిత్వం గురించి వెల్లడిస్తుందని మనస్తత్వవేత్త పేర్కొన్నారు.




