Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

What India Thinks Today: రాహుల్‌లా ఆమేథి వదిలి పోను.. టీవీ9 గ్లోబల్‌ సమ్మిట్‌లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

TV9 గ్లోబల్ సమ్మిట్ ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ 2వ రోజు కార్యక్రమంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రసంగించారు. ప్రభుత్వం మహిళలను ఆస్తికి యజమానురాలిగా చేసిందని వివరించారు.

What India Thinks Today: రాహుల్‌లా ఆమేథి వదిలి పోను.. టీవీ9 గ్లోబల్‌ సమ్మిట్‌లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ
Smriti Irani
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 18, 2022 | 5:34 PM

Smriti Irani – TV9 Global Summit: మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కట్టుదిట్టమైన చర్యలతోపాటు కీలక నిర్ణయాలు తీసుకుందని.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మహిళా డెస్క్‌లు ఉన్న అన్ని పోలీస్ స్టేషన్‌లకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందన్నారు. దేశంలో హెల్ప్‌లైన్ సెంటర్లతోపాటు 90 శాతం జిల్లాల్లో వన్ స్టాప్ సెంటర్లు ఉన్నాయని.. 700 కంటే ఎక్కువ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో నడుస్తున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని కొన్ని ప్రభుత్వాలు ప్రస్తావించడం లేదంటూ స్మృతి ఇరానీ పేర్కొన్నారు. TV9 గ్లోబల్ సమ్మిట్ ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ 2వ రోజు కార్యక్రమంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రసంగించారు. ప్రభుత్వం మహిళలను ఆస్తికి యజమానురాలిగా చేసిందని వివరించారు. మహిళ సంపాదిస్తే హింస ఆగదని, అప్పుడు కూడా హింస జరుగుతుందని, అయితే స్త్రీ ఆస్తికి యజమానిగా మారితే.. ఆమెపై హింస తగ్గుతుందని చాలా ఆధ్యాయనాల్లో పేర్కొన్నట్లు తెలిపారు. ఇప్పడు పోలీసుల వద్దకు వెళ్లకుండా మహిళలను ఎవరూ నిరోధించలేరని.. ఉత్తర భారత రాష్ట్రాల్లో గతంలో మహిళలను వేధించేవారని ఇప్పుడు అలా లేదని అన్నారు. ఇందులో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఏ మహిళ కూడా పోలీసులను ఆశ్రయించడానికి వెనుకాడదన్నారు. మహిళలకు అండగా ప్రధాన మంత్రి ఉన్నారని.. మగువల కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టినట్లు తెలిపారు.

అగ్నిపథ్ పథకంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఏమన్నారంటే..?

అగ్నిపథ్ పథకం గురించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ మాటలను గుర్తు చేసుకున్నారు. సైన్యం సేవ చాలా కష్టమైనదని, దానిని డబ్బుతో విలువ కట్టలేమని ఆయన నాతో చెప్పారన్నారు. సొంత ఆస్తులకు నష్టం కలిగించకూడదని ఓ తల్లిగా చెప్పాలనుకుంటున్నానని అగ్నిపథ్ నిరసనకారులకు సూచించారు.

ఇవి కూడా చదవండి

అది మంచిది కాదు.. రాహుల్‌కు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సూచన

రాహుల్ గాంధీపై ఈడీ చర్యలపై కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై స్మృతి ఇరానీ మాట్లాడారు. ఒక పోలీసు మాకు ఫోన్ చేస్తే, ఈ రోజు నేను బిజీగా ఉన్నాను, నేను రాలేనని చెప్పగలము అని పేర్కొన్నారు. తనను విచారిస్తున్న ఏజెన్సీలపై రాళ్లు రువ్వమని.. అనుచరులకు ఎలా చెబుతాం.. విచారణ సంస్థలు తమ పని తాము చేసుకుపోతున్నాయి. ఈడీ కార్యాలయాల ఎదుట హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారన్నారు. ఇలాంటి విషయాల్లో అది మంచి పద్దతి కాదన్నారు. గాంధీ కుటుంబానికి కంచుకోటగా భావించే అమేథీలో గెలిచిన తర్వాత.. ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని స్మృతి ఇరానీ అన్నారు. తాను రాహుల్‌లా ఆమేథి వదిలి పోనంటూ స్మృతి ఇరానీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అదే సమయంలో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌పై కూడా కేంద్ర మంత్రి విరుచుకుపడ్డారు.

భారతదేశం అంతటా బాలిక్ పంచాయతీ: స్మృతి ఇరానీ

గుజరాత్ నుంచి బాలిక్ పంచాయతీ మొదలైంది. మహిళలను పరిపాలనా విధానంలోకి ఎలా తీసుకురావాలనే దానిపై నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారు. గుజరాత్ ప్రభుత్వం దీనిని సమీకరించింది. ప్రస్తుతం మన దేశంలో 1 కోటి 90 లక్షల మంది మహిళలు వివిధ హోదాల్లో సేవలందిస్తున్నారని స్మృతి ఇరానీ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..