Soldier Body Found: మిస్సైన 13 నెలల తర్వాత పాడైపోయిన స్థితిలో దొరికిన జవాన్‌ డెడ్‌బాడీ.. అసలేం జరిగిందంటే

జమ్ము కశ్మీర్‌ షోపియాన్‌ జిల్లాలో విషాదం నెలకుంది. అక్కడి హృదయ విదారక దృశ్యాలు అందర్నీ కలిచివేస్తున్నాయి. 13నెలల తర్వాత పాడైపోయిన స్థితిలో దొరికిన జవాన్‌ డెడ్‌బాడీని....

Soldier Body Found: మిస్సైన 13 నెలల తర్వాత పాడైపోయిన స్థితిలో దొరికిన జవాన్‌ డెడ్‌బాడీ.. అసలేం జరిగిందంటే
Soldier Body Found
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 23, 2021 | 4:55 PM

జమ్ము కశ్మీర్‌ షోపియాన్‌ జిల్లాలో విషాదం నెలకుంది. అక్కడి హృదయ విదారక దృశ్యాలు అందర్నీ కలిచివేస్తున్నాయి. 13నెలల తర్వాత పాడైపోయిన స్థితిలో దొరికిన జవాన్‌ డెడ్‌బాడీని చూసి శోకసంద్రంలో మునిగిపోయారు కుటుంబసభ్యులు. కన్నవారి కడుపుకోతకు అంతులేకుండా పోయింది. విగతజీవుడిగా కనిపించిన బిడ్డను చూసి విలపిస్తున్న తల్లిదండ్రులను చూసి ప్రతి ఒక్కరూ చలించిపోయారు.

2020 ఆగస్ట్‌ 2న తీవ్రవాదుల చేతిలో కిడ్నాపయ్యాడు జవాన్‌ షకీర్‌ మజ్నూర్‌. ఐతే 13 నెలల తర్వాత దొరికిన అతని డెడ్‌బాడీని స్వస్థలానికి తీసుకొచ్చారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆర్మీ అధికారులు, స్థానికులు ఘనంగా నివాళులర్పించారు. అశ్రు నయనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు. వీరుడా నీకు వందనమంటూ సెల్యూట్‌ చేశారు. షకీర్‌ మజ్నూర్‌..ఇండియన్‌ ఆర్మీలో విధులు నిర్వహించేవాడు.. టెరిటోరియల్‌ యూనిట్‌లోని 162వ బెటాలియన్‌కు చెందిన షకీర్‌..రైఫిల్‌ మ్యాన్‌గా పనిచేసేవాడు. ఐతే గతేడాది ఆగస్ట్‌లో ఈద్‌ జరుపుకునేందుకు..స్వస్థలం షోపియాన్‌ జిల్లా రేషిపొరాలోని తన ఇంటికి వచ్చాడు. పండుగ తర్వాత తిరిగి క్యాంపుకు కారులో వెళ్తుండగా..అడ్డుకున్న మిలిటెంట్స్‌ అతన్ని కిడ్నాప్‌ చేశారు. ఆ తర్వాత పూర్తిగా కాలిపోయిన స్థితిలో అతని కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అప్పటినుంచి షకీర్‌ కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు.

ఐతే నిన్న కుల్గాం జిల్లాలో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆ డెడ్‌బాడీ గతేడాది కనిపించకుండా పోయిన రైఫిల్ మ్యాన్ షకీర్ మంజూర్‌డిగా భావిస్తున్నారు. అతని తండ్రి కూడా ఆ డెడ్‌బాడీ తన కుమారుడిదేనని ధృవీకరించారు. అతని జుట్టు, కాళ్లు, బ్రాస్‌లెట్‌ ఆధారంగా తన కొడుకుదేనని కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే.. ఫోరెన్సిక్‌ అధికారులు డెడ్‌బాడీ నుంచి కొన్ని ఆధారాలను సేకరించారని..డీఎన్‌ఏ పరీక్షల తర్వాతే మృతదేహం ఎవరిదనేది నిర్ధారిస్తామని తెలిపారు పోలీసులు.

Also Read: Viral Video: మనిషి రక్తం మితిమీరి తాగింది.. చివరకు పొట్ట పగిలిపోయింది

“మత్తుపై ఉక్కుపాదం”.. ఎస్‌ఈబీ అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు

పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఈ సంక్రాంతికి కలర్ ఫుల్ ముగ్గుల డిజైన్స్ మీకోసం..
ఈ సంక్రాంతికి కలర్ ఫుల్ ముగ్గుల డిజైన్స్ మీకోసం..
రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్నాడు.. పిచ్చోడు అనుకునేరు..
రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్నాడు.. పిచ్చోడు అనుకునేరు..
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. తొలి మ్యాచ్‌లో సారథిగా ఎవరంటే?
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. తొలి మ్యాచ్‌లో సారథిగా ఎవరంటే?
విజయ్ దళపతితో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ?
విజయ్ దళపతితో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ?
ఫార్మా GCCలకు కేంద్రబిందువుగా హైదరాబద్.. 25 లక్షల కొత్త ఉద్యోగాలు
ఫార్మా GCCలకు కేంద్రబిందువుగా హైదరాబద్.. 25 లక్షల కొత్త ఉద్యోగాలు
ఇదెక్కడి అన్యాయం బ్రో.. ఆ ముగ్గురికి మాత్రం మరోసారి మొండిచేయి
ఇదెక్కడి అన్యాయం బ్రో.. ఆ ముగ్గురికి మాత్రం మరోసారి మొండిచేయి
సంక్రాంతికి ఊరెళుతున్నారా...? అయితే ఈ అలర్ట్ మీకోసమే!
సంక్రాంతికి ఊరెళుతున్నారా...? అయితే ఈ అలర్ట్ మీకోసమే!