Viral Video: భాంగ్రా డ్యాన్స్‌తో అదరగొట్టిన పంజాబ్ సీఎం.. టాలెంట్ చూసి ఆశ్చర్యపోయిన సభికులు

Punjab CM Charanjit Channi: పంజాబ్ కొత్త సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ భాంగ్రా డ్యాన్స్‌తో అదరగొట్టారు. విద్యార్థులతో కలిసి ఆయన భాంగ్రా డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: భాంగ్రా డ్యాన్స్‌తో అదరగొట్టిన పంజాబ్ సీఎం.. టాలెంట్ చూసి ఆశ్చర్యపోయిన సభికులు
Punjab Cm Charanjit Channi Bhangra Dance
Follow us
Janardhan Veluru

|

Updated on: Sep 23, 2021 | 5:02 PM

పంజాబ్ కొత్త సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ పంజాబీల సాంప్రదాయక భాంగ్రా డ్యాన్స్‌తో అదరగొట్టారు. కాలేజీ విద్యార్థులతో కలిసి ఆయన భాంగ్రా డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జలంధర్‌లోని ఐకే గుజ్రాల్ పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తమతో కలిసి భాంగ్రా డ్యాన్స్ చేయాలంటూ విద్యార్థులు కోరడంతో అందుకు ఆయన అంగీకరించారు. స్టేజ్‌పై విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అందరినీ మెప్పుపొందారు. ఆయన డ్యాన్స్ టాలెంట్ చూసి విద్యార్థులు, సభికులందరూ ఆశ్చర్యపోయారు.

అటు విద్యార్థులతో కలిసి సీఎం చన్నీ సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ముఖ్యమంత్రి అన్న భేషజాలు చన్నీకి ఏ మాత్రం లేదని.. ఆయన సామాన్య ప్రజల సీఎం అంటూ కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ వీడియోను పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ(PTU) అధికారులు వర్సిటీ  అధికారిక ట్విట్టర్ ఖాతాలోనూ షేర్ చేశారు.

విద్యార్థులతో కలిసి పంజాబ్ సీఎం చన్నీ భంగ్రా డ్యాన్స్..

కెప్టెన్ అమరీందర్ సింగ్ స్థానంలో ఇటీవల చరణ‌జిత్ సింగ్ చన్నీ పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. ఆ రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న కుప్పలాటలు, ఎమ్మెల్యేల అసంతృప్తి కారణంగా అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

Also Read..

రెడీమేడ్ దుస్తులు కొనడం ఇకపై మరింత భారం కానుంది.. త్వరలో పెరగనున్న ధరలు.. ఎందుకంటే..

రసవత్తరంగా మా ఎలక్షన్స్.. మంచు విష్ణు ప్యానెల్ పై స్పందించిన నరేష్.. ఏమన్నారంటే..