Ready Made Dresses: రెడీమేడ్ దుస్తులు కొనడం ఇకపై మరింత భారం కానుంది.. త్వరలో పెరగనున్న ధరలు.. ఎందుకంటే..
రెడీమేడ్ దుస్తులు మరింత ప్రియం కానున్నాయి. ఇటీవల జరిగిన గూడ్స్ అండ్ సర్వీసెస్ కౌన్సిల్ (జీఎస్టీ కౌన్సిల్) సమావేశంలో రెడీమెడ్ దుస్తులపై ఇన్వర్టెడ్ టాక్స్(విలోమ సుంకం) విధించాలని నిర్ణయం తీసుకుంది.
Ready Made Dresses: రెడీమేడ్ దుస్తులు మరింత ప్రియం కానున్నాయి. ఇటీవల జరిగిన గూడ్స్ అండ్ సర్వీసెస్ కౌన్సిల్ (జీఎస్టీ కౌన్సిల్) సమావేశంలో రెడీమెడ్ దుస్తులపై ఇన్వర్టెడ్ టాక్స్(విలోమ సుంకం) విధించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. దీంతో జనవరి 1 నుంచి రెడీమేడ్ దుస్తుల ధరలు పెరిగుతాయి. రెడీమేడ్ దుస్తులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు ఇప్పుడు చెల్లిస్తున్న ధరలకు అదనంగా 7 శాతం వరకూ చెల్లించాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు 1000 రూపాయలకు కొంటున్న షర్ట్ జనవరి 1 నుంచి 1070 రూపాయలు అవుతుంది.
ఈ సుంకం విధింపు పై వస్త్ర వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది రెడీమేడ్ దుస్తుల అమ్మకాలపై నేరుగా ప్రభావం చూపిస్తుందని వారు భయపడుతున్నారు. ఎందుకంటే.. ముడిసరుకు ధరల పెరుగుదల కారణంగా ఇప్పటికే గత సంవత్సరం రెడీమేడ్ దుస్తుల ధరలు 20 శాతం పెరిగాయి. ఇది మరింత పెరిగితే ఆ ప్రభావం వినియోగదారుల కొనుగోళ్ళపై పడుతుంది.
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో, వస్త్రాలకు సంబంధించిన విలోమ విధి నిర్మాణాన్ని సంస్కరించాలని ప్రకటించారు. ఈ కొత్త డ్యూటీ ఛార్జీలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలు చేసే అవకాశం ఉంది. క్లాత్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CMAI) ప్రకారం, భారతదేశంలో విక్రయించే 85 శాతం వస్త్రాల ధర రూ .1000 కంటే తక్కువ, సుంకం ఛార్జీలలో మార్పు వ్యయాన్ని ఎక్కువగా పెంచుతుంది.
ప్రస్తుతం1,000 రూపాయల కంటే తక్కువ ధర కలిగిన రెడీమేడ్ దుస్తులకు GST 5 శాతం విధిస్తున్నారు. దీనిని మరింతగా 12 శాతానికి పెంచవచ్చు. రెడీమేడ్ వస్త్రాల జీఎస్టీ పెరగడానికి కారణం, ఫ్యాబ్రిక్ లేదా నూలు వంటి ముడి పదార్థాల జీఎస్టీ. ఇది ప్రస్తుతం 12 శాతం చొప్పున స్థిరంగా ఉండటం ఆందోళన కలిగించే విషయం.
భారతీయ టెక్స్‌టైల్ పరిశ్రమల సమాఖ్య మాజీ అధ్యక్షుడు సంజయ్ జైన్ మాట్లాడుతూ, “గత ఏడాది కాలంలో వస్త్రాల ధర ఇప్పటికే 20 శాతం పెరిగింది. ఇప్పుడు మళ్లీ 7 శాతం పెరిగినందున, తక్కువ, మధ్య-ఆదాయ సంపాదనపరులు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇది వస్త్రాల డిమాండ్‌ని ప్రభావితం చేస్తుంది. ” అన్నారు.
“ప్రస్తుతం, పత్తి నూలు, ఫాబ్రిక్‌పై ఐదు శాతం జీఎస్టీ విధిస్తున్నారు, కానీ కొత్త నిర్ణయం ప్రకారం, పత్తితో తయారు చేసిన వస్త్రాలపై 12 శాతం జీఎస్టీ విధిస్తారు. అవి కూడా ఖరీదైనవిగా మారతాయి” అని జైన్ తెలిపారు.
సిఎమ్‌ఎఐ మాజీ ఛైర్మన్, మెంటార్ రాహుల్ మెహతా మాట్లాడుతూ, “ప్రభుత్వం విలోమ సుంకం నిర్మాణాన్ని సరిచేయాల్సి ఉంటుంది. అప్పుడు ముడి పదార్థాలపై అధిక జీఎస్టీని కూడా తగ్గించవచ్చు. వ్యాపారవేత్తల పని ఇప్పటికే నెమ్మదిగా సాగుతోంది. జనవరి 1 నుండి ఖర్చులు, ఏడు శాతం పెరిగే జీఎస్టీ కలిసి బట్టల వ్యాపారాన్ని మరింత తగ్గిస్తాయి. ” అని చెబుతున్నారు.
“ఈ విషయమై CMAI టెక్స్‌టైల్స్ మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖకు సూచనలు పంపింది. ఈ నిర్ణయం కారణంగా రశీదు లేకుండా కొనుగోళ్లు ఊపందుకున్నాయనే ఆందోళనను వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు” అని మెహతా చెప్పారు.
Also Read: LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు షాక్.. వెయ్యి రూపాయలకు చేరుకోనున్న వంట గ్యాస్ సిలెండర్!
Airports: వేల కోట్ల నష్టాలతో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ తెరపైకి తెచ్చిన ఫార్ములా.. కేంద్రం దారెటు.?