AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: “మత్తుపై ఉక్కుపాదం”.. ఎస్‌ఈబీ అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోపై సీఎం జగన్ సమీక్ష గురువారం సమీక్ష నిర్వహించారు.  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కార్యకలాపాల ప్రగతిపై సీఎంకు వివరాలు అందించారు అధికారులు.

Andhra Pradesh: మత్తుపై ఉక్కుపాదం.. ఎస్‌ఈబీ అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు
Cm Jagan
Ram Naramaneni
|

Updated on: Sep 23, 2021 | 3:53 PM

Share

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోపై సీఎం జగన్ సమీక్ష గురువారం సమీక్ష నిర్వహించారు.  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కార్యకలాపాల ప్రగతిపై సీఎంకు వివరాలు అందించారు అధికారులు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక కామెంట్స్  చేశారు. మద్య నియంత్రణలో భాగంగా రేట్లను పెంచామని, మూడింట ఒక వంతు దుకాణాలను మూసివేశామని ముఖ్యమంత్రి చెప్పారు.

“బెల్టుషాపులను తీసేశాం. పర్మిట్‌రూమ్‌లను మూసివేయించాం. లిక్కర్‌ సేల్స్‌ నెలకు 34 లక్షల కేసుల నుంచి 21 లక్షల కేసులకు తగ్గాయి. బీరు సేల్స్‌ నెలకు 17 లక్షల కేసుల నుంచి 7 లక్షలకు తగ్గాయి. ఇలాంటి సందర్భంలో అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని, మద్యం తయారీని అధికారులు అడ్డుకోవాలి. అక్రమ రవాణాపైన, అక్రమంగా మద్యం తయారీపైన ఉక్కుపాదం మోపాలి. మద్యం అక్రమ రవాణా, తయారీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇదివరకే చట్టాన్ని తీసుకు వచ్చాం. ఆ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి” అని సీఎం పేర్కొన్నారు.

ఇక నిర్దేశించిన రేట్లకన్నా ఇసుకను ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ఎస్‌ఈబీ కాల్‌సెంటర్‌ నంబర్‌పై బాగా ప్రచారం చేయాలని, అధిక రేట్లకు ఎవరైనా అమ్మితే వెంటనే వినియోగదారులు ఆ నంబర్‌కు కాల్‌చేసేలా ప్రచారం చేయాలని ఆదేశించారు.  వచ్చే కాల్స్‌పై సత్వరమే స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.  సంబంధిత జిల్లాల వారీగా ఈ ప్రచారం చేయాలని.. ఆ జిల్లాల్లో రేట్ల వివరాలను తెలియజేస్తూ అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వాలని పేర్కొన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే మరిన్ని రీచ్‌లు, డిపోల సంఖ్య పెంచేలా చూడాలన్న సీఎం ఆదేశించారు.

ఇక గంజాయి సాగు, రవాణాను అరికట్టాలని సీఎం ఆదేశించారు. క్రమం తప్పకుండా దాడులు నిర్వహించాలని.. పోలీసు విభాగాల సమన్వయంతో పనిచేయాలని సూచించారు.  డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.  ఏ కాలేజీలోనైనా అలాంటి ఉదంతాలు కనిపిస్తే.. అక్కడ ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం ఆదేశించారు. ఆరోగ్యానికి అత్యంత హానికరంగా మారిన గుట్కా విక్రయాలు, రవాణాపైన ఫోకస్ పెట్టాలని సూచించారు.

Also Read: కొడాలి నానిపై పోటీకి వంగవీటి రాధా సై.. స్నేహానికి ఎండ్ కార్డ్

అడ్మిషన్​ కోసం వచ్చిన విద్యార్థి తల్లితో క్లాస్‌రూమ్‌లో హెడ్​మాస్టర్​ మసాజ్​

Follow Us
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..