High School: అడ్మిషన్ కోసం వచ్చిన విద్యార్థి తల్లితో క్లాస్‌రూమ్‌లో హెడ్మాస్టర్ మసాజ్
ఇది సభ్య సమాజం తలదించుకునే ఘటన. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పి.. వారి ఉన్నతికి కారణం కావాల్సిన వ్యక్తి ఉపాధ్యాయుడు. అందుకే సమాజంలో ఉపాధ్యాయ వృత్తి అంటే అమితమైన గౌరవం ఉంటుంది.
ఇది సభ్య సమాజం తలదించుకునే ఘటన. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పి.. వారి ఉన్నతికి కారణం కావాల్సిన వ్యక్తి ఉపాధ్యాయుడు. అందుకే సమాజంలో ఉపాధ్యాయ వృత్తి అంటే అమితమైన గౌరవం ఉంటుంది. కానీ కొందరు ఉపాధ్యాయులు ట్రాక్ తప్పి.. చెడ్డపేరు తీసుకువస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ.. వృత్తికి మాయని మచ్చ తెస్తున్నారు. తాజాగా కర్ణాటక బెంగళూరులోని ఓ ఉన్నత పాఠశాలలో ఓ ప్రధానోపాధ్యాయుడు చేసిన పనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అడ్మిషన్ కోసం వచ్చిన ఓ విద్యార్థి తల్లితో అతడు తప్పుగా ప్రవర్తించాడు.
అసలేం జరిగిందంటే…
ఓ మహిళ తన చిన్నారికి అడ్మిషన్ కోసం నగరంలోని కొదండరామాపుర ఉన్నత పాఠశాలకు వచ్చింది. ఈ క్రమంలో తనకు మసాజ్ చేయాలని ఆ మహిళను ఒత్తిడి చేశాడు ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు లోకేశప్ప. బ్యూటీపార్లర్ నడుపుతున్న ఆ మహిళ తన కూతురు కోసం అడ్మిషన్ కోరుతూ లోకేశప్పను స్కూల్లో సంప్రదించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మహిళ నేపథ్యం గురించి ఆరా తీసిన లోకేశప్ప మసాజ్ చేయమని అడిగాడు. ఒత్తిడికి గురైన ఆ మహిళ అతనికి మసాజ్ చేయడానికి అంగీకరించింది. తరువాత, లోకేశప్ప టీచర్లందరినీ బయటకు పంపించి, క్లాస్ రూమ్‌లలో ఒకచోట చొక్కాను తీసివేసి మసాజ్ చేయించుకున్నాడు. ఈ సంఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్‌గా మారగా.. లోకేశప్ప బాగోతం వెలుగులోకి వచ్చింది.
విషయం తెలుసుకున్న బృహత్ బెంగళూరు మహానగర పాలిక.. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ బుధవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. పని వేళల్లో తమ బాధ్యతలను మరిచి ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు తేల్చి కర్ణాటక సివిల్ సర్వీసెస్ చట్టం ప్రకారం చర్యలు చేపట్టారు. శాఖా పరమైన విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు. లోకేశప్ప గతంలో కూడా మహిళా సిబ్బందితో తప్పుగా ప్రవర్తించినట్లు ఆరోపణలున్నాయి.
Also Read: . కొడాలి నానిపై పోటీకి వంగవీటి రాధా సై.. స్నేహానికి ఎండ్ కార్డ్