Sherlyn Chopra: రాహుల్‌గాంధీని పెళ్లి చేసుకుంటా.. కానీ, ఓ కండీషన్.. నటి షెర్లిన్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..

Sherlyn Chopra: మోడల్‌, నటి షెర్లిన్‌ చోప్రా మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ డిఫరెంట్‌ స్టైల్లో కామెంట్స్‌ చేసే షెర్లిన్‌.. తాజాగా రాహుల్‌గాంధీపై మనసు పారేసుకుంది. కాంగ్రెస్‌ యువరాజును పెళ్లి చేసుకుంటానని ప్రకటించి సంచలనంగా మారారు.

Sherlyn Chopra: రాహుల్‌గాంధీని పెళ్లి చేసుకుంటా.. కానీ, ఓ కండీషన్.. నటి షెర్లిన్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
Sherlyn Chopra
Follow us
Venkata Chari

|

Updated on: Aug 06, 2023 | 5:37 AM

Sherlyn Chopra: బిగ్‌బాస్‌ ఫేమ్‌, నటి షెర్లిన్ చోప్రా తన అందంతో అందర్నీ తెగ ఆకర్షిస్తుంటారు. బట్టల నుంచి ఆమె చేష్టల వరకు అన్నీ చర్చనీయాంశం అవుతుంటాయి. ఈ క్రమంలోనే.. ఆమెకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్చల్‌ చేస్తుంటాయి. ప్రతిసారీ ఆమె ఏదో ఒక కారణంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె బట్టలు, అది బోల్డ్ ప్రకటనలు, ఇంటర్నెట్‌లో నిరంతరం వైరల్‌గా మారుతుంటాయి. ఆమె వీడియోలు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షెర్లిన్ పేరు కూడా అనేక వివాదాలతో ముడిపడి ఉన్నప్పటికీ.. అవేవీ పట్టించుకోకుండా లైఫ్‌ను కూల్‌గా ఎంజాయ్‌ చేస్తుంటారు.

తాజాగా.. షెర్లిన్‌ చోప్రాకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు రాజకీయంగానూ చర్చల్లోకి వెళ్లింది. మోదీ ఇంటి పేరు కేసులో రాహుల్‌గాంధీకి ఊరట లభించగా.. దానిపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తి సమాధానాలు చెప్పారు. ఆ కేసులో రాహుల్‌గాంధీకి రిలీఫ్‌ దొరకడంపై హర్షం చేశారు షెర్లిన్‌చోప్రా. అదే సమయంలో.. ఒకరు రాహుల్‌గాంధీని పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించగా.. రెండో మాటే లేకుండా ఓకే చెప్పేయడం ఆసక్తిగా మారింది.

ఇవి కూడా చదవండి

అంతేకాదు.. రాహుల్‌గాంధీని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు.. అందులో తప్పేముందంటూ అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు షెర్లిన్‌. అయితే.. షెర్లిన్‌.. రాహుల్‌ని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే.. అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వులు చిందించారు. అయితే.. పెళ్లి విషయంలో కొన్ని షరతులు ఉంటాయని చెప్పుకొచ్చారు. పెళ్లి తర్వాత కూడా సర్‌నేమ్‌ చోప్రాగానే ఉంటుందన్నారు.

షెర్లిన్ ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, చాలా మంది వినియోగదారులు కామెంట్లు చేస్తున్నారు. ‘ఈమె కూడా రాఖీ సావంత్‌ చెల్లిలా అనిపిస్తుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘రాహుల్ గాంధీ ఆమెను పెళ్లి చేసుకుని తన జీవితాన్ని వృధా చేసుకోవాలకోడు’ అంటూ మరొకరు కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది షెర్లిన్‌ని ట్రోల్ చేశారు.

షెర్లిన్ చోప్రా ఇంతకుముందు చాలాసార్లు వివాదాల్లో చిక్కుకుంది. ఆమె తన ప్రకటనల వల్ల ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. దర్శకుడు సాజిద్ ఖాన్‌ను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు ఆమె మళ్లీ వెలుగులోకి వచ్చింది. కానీ, ఆమె అందులో విఫలమైంది. సాజిద్‌ను బయటకు తీసుకురావడానికి ఆమె పోలీసులను కూడా ఆశ్రయించింది. ఆమె సాజిద్‌పై ఫిర్యాదు కూడా చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..