AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Woman Anju: పాక్‌ వెళ్లిన అంజూ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్‌.. వీసా గడువు పొడిగించిన ప్రభుత్వం..

Indian Woman Anju: పాకిస్తాన్‌ వెళ్లిన భారతీయ మహిళ అంజూ ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. అంజూ వీసాను పాక్‌ ప్రభుత్వం పొడిగించింది. దాంతో.. ఆమె అక్కడే ఉండిపోవాలని ఫిక్స్‌ అయినట్లు అంజూ కొత్త భర్త నస్రుల్లా చెప్తున్నారు. తాజాగా.. ఆమె ఇద్దరి పిల్లల్ని పాక్‌ పంపాలని నస్రుల్లా కోరడం అనుమానాలకు తావిస్తోంది. అయితే.. భారత్‌లో ఉన్న అంజు పిల్లలు మాత్రం పాకిస్థాన్‌ వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. ఇక.. మొన్నామధ్య ఇండియాలో ఉన్న తన భర్తకు అంజు ఫోన్ చేసింది. పిల్లలను పాకిస్తాన్‌కు పంపడం గురించి ఇద్దరి మధ్య ఫోన్‌లో చర్చలు జరిగాయి.

Indian Woman Anju: పాక్‌ వెళ్లిన అంజూ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్‌.. వీసా గడువు పొడిగించిన ప్రభుత్వం..
Indian Woman Anju
Venkata Chari
|

Updated on: Aug 06, 2023 | 5:17 AM

Share

Indian Woman Anju: పాకిస్తాన్‌ వెళ్లిన భారతీయ మహిళ అంజూ ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. అంజూ వీసాను పాక్‌ ప్రభుత్వం పొడిగించింది. దాంతో.. ఆమె అక్కడే ఉండిపోవాలని ఫిక్స్‌ అయినట్లు అంజూ కొత్త భర్త నస్రుల్లా చెప్తున్నారు. తాజాగా.. ఆమె ఇద్దరి పిల్లల్ని పాక్‌ పంపాలని నస్రుల్లా కోరడం అనుమానాలకు తావిస్తోంది.

రాజస్థాన్‌లోని భివాడికి చెందిన అంజూ.. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన పాకిస్తాన్‌కు చెందిన ప్రేమికుడు నస్రుల్లాను వివాహం చేసుకుంది. ఇస్లాం మతంలోకి మారి ఫాతిమాగా పేరు మార్చుకుని మరీ.. నస్రుల్లాను ప్రేమ వివాహమాడింది. దాంతో పాక్ ప్రభుత్వం ఆమెకు పాకిస్థాన్ పౌరసత్వం ఇచ్చింది. అంజూ.. నస్రుల్లాను పాక్ కోర్టులో వివాహం చేసుకోవడంతో ఆమెకు పాక్ పౌరసత్వం ఇచ్చినట్లు తెలుస్తోంది. దాని ద్వారా.. ఆమెను ఎప్పటికీ అక్కడే ఉంచుకోవాలని పాకిస్థాన్ పన్నాగం పన్నుతోంది.

ఇవి కూడా చదవండి

నస్రుల్లాతో అంజు వివాహం తర్వాత.. ఒక పాక్ వ్యాపారవేత్త ఆమెకు ప్లాట్లు, కొంత డబ్బు బహుమతి ఇచ్చారు. ఇదీలావుంటే.. ఇప్పుడు.. ఏకంగా అంజూ పిల్లలను కూడా పాకిస్తాన్‌ పంపాలని నస్రుల్లా విజ్ఞప్తి చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఫాతిమా ఇప్పుడు ఎప్పటికీ పాకిస్థాన్‌లోనే ఉంటుందని నస్రుల్లా చెప్పారు. అందుకే.. అంజు పిల్లలిద్దరినీ పాకిస్తాన్‌కు పంపాలని నస్రుల్లా భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ డిమాండ్ వెనుక తల్లి, బిడ్డల మధ్య ప్రేమానుబంధాన్ని కూడా నస్రుల్లా తెరపైకి తెచ్చాడు.

అయితే.. భారత్‌లో ఉన్న అంజు పిల్లలు మాత్రం పాకిస్థాన్‌ వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. ఇక.. మొన్నామధ్య ఇండియాలో ఉన్న తన భర్తకు అంజు ఫోన్ చేసింది. పిల్లలను పాకిస్తాన్‌కు పంపడం గురించి ఇద్దరి మధ్య ఫోన్‌లో చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే.. ఇండియాలోనున్న అంజు భర్త ఆమె విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించారు. పిల్లలు తనను మరచిపోయారని, పాకిస్తాన్‌కు వెళ్లడం వాళ్లకు అస్సలు ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ క్రమంలో విడాకులు తీసుకోకుండానే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని ఫోన్‌లో కూడా బెదిరించారని పాక్‌ వెళ్లిన అంజుపై భర్త అరవింద్‌ శుక్రవారం ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాడు. అంజు విడాకులు తీసుకోకుండానే పాకిస్థాన్ వెళ్లి తన పాకిస్థానీ ప్రేమికుడిని పెళ్లి చేసుకుంది. అంజు పాకిస్థాన్ భర్త నస్రుల్లా (29) పేరు కూడా ఎఫ్‌ఐఆర్‌లో ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..