AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madras High Court: గుడిలోకి వితంతు మహిళ ప్రవేశం అడ్డుకోవడంపై మద్రాస్ హైకోర్టు సీరియస్.. ఏం చెప్పిందంటే

ఆలయంలోకి వితంతు మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడంపై మద్రాస్ హైకోర్టు ఫైర్ అయ్యింది. వితంతువులను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం చట్టాల ద్వారా పారిపాలించబడుతున్న ఈ నాగరిక సమాజంలో జరగవని పేర్కొంది. ఓ వితంతు మహిళ వేసిన పిటీషన్‌పై ఇలా స్పందించింది. తమిళనాడులోకి ఈరోడ్ జిల్లాలో తంగంణి అనే వితంతు మహిళను పెరియాకారుపరాయణ్ ఆలయంలోకి వెళ్లకుండా కొందరు ఆపారు.

Aravind B
|

Updated on: Aug 05, 2023 | 9:49 PM

Share
ఆలయంలోకి వితంతు మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడంపై మద్రాస్ హైకోర్టు ఫైర్ అయ్యింది. వితంతువులను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం చట్టాల ద్వారా పారిపాలించబడుతున్న ఈ నాగరిక సమాజంలో జరగవని పేర్కొంది. ఓ వితంతు మహిళ వేసిన పిటీషన్‌పై ఇలా స్పందించింది.

1 / 5
తమిళనాడులోకి ఈరోడ్ జిల్లాలో తంగంణి అనే వితంతు మహిళను పెరియాకారుపరాయణ్ ఆలయంలోకి వెళ్లకుండా కొందరు ఆపారు. గతంలో ఆ టెంపుల్‌లో పనిచేసిన ఆమె భర్త 2017లో మరణించాడు. ఆలయంలో నిర్వహించే ఉత్సవాల్లో కొడుకుతో కలిసి పాల్గొనాలని తంగమణి భావించింది.

2 / 5
కానీ వితంతువు కావడం వల్ల గుడిలోకి ప్రవేశం లేదని అడ్డుకున్నారు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేసిన మద్రాస్ హైకోర్టు.. వితంతువు ఆలయంలోకి వస్తే అపవిత్రం వస్తుందని ప్రాచీన నమ్మకం రాష్ట్రంలో ఉండటం ఎంతో దురదృష్టకరమని తెలిపింది.

3 / 5
ఈ నాగరిక సమాజంలో ఇలాంటివి  సాగవని తీర్పునిచ్చింది. వితంతువులను ఆలయంలోకి రాకుండా అడ్డుకుంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

4 / 5
ఒక మహిళ తనకుంటూ ఒక హోదా, గుర్తింపును కలిగి ఉంటుందని చెప్పింది. ఆగస్టు 9, 10 వ తేదీల్లో జరిగే ఉత్సవాల్లో తంగమణి అలాగే ఆమె కుమారుడు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

5 / 5